Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీన్.. ఇలా రివర్స్ అవుతుందని ఊహించలేదు భయ్యా- ప్లేఆఫ్స్ నుంచి అవుట్

RCB vs KKR: ఓ చిన్న బ్రేక్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన ఐపీఎల్ 2025.. డిఫెండింగ్ ఛాంపియన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. గత సీజన్ విజేత కోల్ కత నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ నుంచి వైదొలిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగాల్సిన మ్యాచ్.. భారీ వర్షం వల్ల రద్దయింది. ఒక్క బంతి కూడా పడకుండానే కాల్డ్ ఆఫ్ అయింది.

ఫలితంగా- కేకేఆర్ ప్లేఆఫ్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. భారత్- పాకిస్తాన్ మధ్య తలెత్తిన యుద్ధం, ఉద్రిక్త పరిస్థితులను ద్రష్టిలో పెట్టుకుని కిందటి వారం ఐపీఎల్ 2025 తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. భారత్ పై పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లను సంధించిన నేపథ్యంలో భద్రత కారణాల వల్ల అప్పట్లో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు కూడా అయింది.

KKR have been knocked out from IPL 2025 after a match called off against RCB due to rain

ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నందున ఐపీఎల్ 2025 సీజన్ పునఃప్రారంభమైంది. ప్లేఆఫ్స్ ను దాదాపుగా ఖాయం చేసుకున్న ఆర్సీబీ.. కేకేఆర్ ను ఢీకొట్టాల్సి ఉన్నప్పటికీ.. వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయింది. కనీసం టాస్ కూడా పడలేదంటే- వర్షం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మ్యాచ్ రద్దు కావడం వల్ల ఈ రెండు జట్లకూ చెరో పాయింట్ లభించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 12వ మ్యాచ్. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ లల్లో ఎనిమిదింట్లో విజయఢంకా మోగించిందీ టీమ్. మొత్తం 17 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.

కేకేఆర్ తో మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ ఖాయమైనట్టేనని భావించినప్పటికీ- అలా జరగలేదు. ఇంకో గేమ్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది ఆర్సీబీకి. చేతిలో ఇంకో రెండు మ్యాచ్ లు మిగిలివున్నాయి. ఈ నెల 23వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్, 27న లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో ఏ ఒక్కటి గెలిచినా ప్లేఆఫ్స్ ఖాయమైనప్పట్టే.

ఈ సీజన్ లో ప్లేఆప్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.. కోల్ కత నైట్ రైడర్స్. ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే గెలిచి తీరాల్సిన గేమ్ ఇది. ఇప్పటివరకు 13 మ్యాచ్ లల్లో ఆడిన నైట్ రైడర్స్ అయిదింట్లో గెలిచింది. ఆరింట్లో ఓడింది. రెండు మ్యాచ్ లు రద్దయ్యాయి. మొత్తం 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.

బెంగళూరులో నాలుగైదు రోజులుగా ప్రతి సాయంత్రం పూటా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. నేడు కూడా అదే పరిస్థితులు తలెత్తాయి. ఈ మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ- ఆ తరువాత ఆకాశం మేఘావ్రతమైంది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది.

కనీస తెరిపినివ్వలేదు. టాస్ కూడా పడనూ లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక అండర్ గ్రౌండ్ సబ్ ఎయిర్ సిస్టమ్ ఉన్న విషయం తెలిసిందే. ఎంత వర్షం పడినప్పటికీ ఆ నీరంతా కూడా 20-25 నిమిషాల్లో బయటికి వెళ్లే వ్యవస్థ ఇక్కడ ఉంది. వర్షం ఆగకుండా పడటం వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+