సొంత గడ్డపై తొలిమ్యాచ్- హార్దిక్ సేనకు అనన్య పాండే కావాల్సొచ్చిందట..

MI vs KKR: ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కష్టాలు తీరట్లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయిందా జట్టు. అహ్మదాబాద్‌లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇప్పటివరకు ఆడిన రెండింట్లోనూ ఘోరంగా ఓడింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారింది.

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ తీరు ఏ మాత్రం మారలేదు.. మెరుగుపడనూ లేదు. ఓపెనర్లు మరోసారి ఘోరంగా విఫలం అయ్యారు. గెలవడానికి 197 పరుగులు చేయాల్సిన దశలో 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడం ఆ జట్టు బ్యాటింగ్ బలహీనతలను బహిర్గతం చేసింది.

MI vs KKR Ananya Panday to perform in Mumbai for Mumbai Indians match against KKR in IPL 2025

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. దీనికి ధీటుగా రాణించలేకపోయింది ముంబై ఇండియన్స్. ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగుల వద్దే చతికిలపడింది. 36 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది.

గుజరాత్ ఇన్నింగ్‌లో ఓపెనర్ సాయి సుదర్శన్ టాప్ స్కోరర్ ఈ ఇన్నింగ్‌లో. 41 బంతుల్లో రెండు భారీ సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 63 పరుగులు కొట్టాడు. కేప్టెన్ శుభ్‌మన్ గిల్- 38, టాప్ ఆర్డర్ బ్యాటర్ జోస్ బట్లర్- 39 పరుగులతో రాణించారు. మిడిలార్డర్‌లో షెర్ఫానె రూథర్‌ఫర్డ్- 18 పరుగులు తప్ప మిగిలిన వాళ్లు చేసింది సింగిల్ డిజిట్టే.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ-8, రియాన్ రికెల్టన్- 6, తిలక్ వర్మ- 36, సూర్యకుమార్ యాదవ్- 48, రాబిన్ మిన్జ్- 3, హార్దిక్ పాండ్యా- 11, నమన్ ధీర్- 18, మిఛెల్ శాంట్నర్- 18 పరుగులు చేశారు. తిలక్ వర్మ- సూర్యకుమార్ యాదవ్ మధ్య నెలకొన్న 62 పరుగులే అతిపెద్ద పార్ట్‌నర్‌షిప్. వారిద్దరే గుజరాత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొనగలిగారు.

ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు గెలుపు రుచి చూడలేదు. ఆడిన రెండింట్లోనూ పరాజయాలే ఎదురయ్యాయి. తన తదుపరి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌తో తలపడనుంది. సోమవారం సాయంత్రం 7:30 గంటలకు ముంబై వాంఖెడె స్టేడియంలో ఈ మ్యాచ్ ఉంటుంది. సొంత గడ్డపై ఆడబోతోండటం ప్లస్ పాయింట్.

ఈ మ్యాచ్‌కు ముందు గ్రాండ్‌ సెలబ్రేషన్స్ నిర్వహించనుంది ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం. సొంతగడ్డపై తొలి మ్యాచ్ కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 6:30 గంటలకు సెలబ్రేషన్స్ ఆరంభమౌతాయి. బాలీవుడ్ నటి అనన్య పాండే పెర్‌ఫార్మ్ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+