జోస్యం రివర్స్.. మళ్లీ నోటికి పనిచెప్పిన పాక్ మాజీ పేసర్!

T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత్ అప్రతిహత విజయాలతో సెమీస్‌కు చేరుకుంది. అయితే పాకిస్థాన్ జట్టు మాత్రం గ్రూప్ దశలోనే భారత్ చేతిలో పరాజయం పాలై సూపర్-8 నుంచే ఇంటిదారి పట్టింది. తమ జట్టు ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న పాక్ మాజీ క్రికెటర్లు ఇప్పుడు భారత జట్టుపై పరోక్షంగా విషం చిమ్ముతున్నారు.

మహమ్మద్ ఆమిర్ జోస్యం రివర్స్!
పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ టోర్నీకి ముందు భారత్ సెమీఫైనల్‌కు చేరుకోదని జోస్యం చెప్పారు. "పాకిస్థాన్ అవుట్ అయినా పర్లేదు కానీ, భారత్ మాత్రం క్వాలిఫై కాకూడదు" అని ఒక కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ టీమిండియా అద్భుత ప్రదర్శనతో సెమీస్‌కు వెళ్లడంతో మహమ్మద్ ఆమిర్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

Mohammad Amir U-Turn Praises Sanju Samson but Slams Team India After Semifinal Qualification

సంజూ శాంసన్‌పై ప్రశంసలు.. జట్టుపై విమర్శలు
వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సంజూ శాంసన్ 50 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌పై ఆమిర్ స్పందిస్తూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సంజూ శాంసన్ తన జీవితంలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని, 65 వేల మంది ప్రేక్షకుల మధ్య ఒత్తిడిలో అద్భుతంగా రాణించాడని మహమ్మద్ ఆమిర్ మెచ్చుకున్నాడు. అయితే ఒక ఇన్నింగ్స్‌తో భారత్ లోపాలు దాగిపోవని ఆమిర్ అన్నాడు. భారత్ ఇంకా సమతుల్యమైన క్రికెట్ ఆడటం లేదని, ఫీల్డింగ్‌లో మూడు, నాలుగు క్యాచ్‌లు వదిలేశారని విమర్శించాడు. జస్ప్రీత్ బుమ్రాను మినహాయిస్తే మిగిలిన బౌలర్లందరూ పరుగులు ఇస్తున్నారని.. భారత్ కేవలం ఒక్క బౌలర్‌పైనే ఆధారపడి ఆడుతోందని పాక్ మాజీ పేసర్ ఎద్దేవా చేశాడు.

సెమీఫైనల్‌లో అసలైన పరీక్ష
భారత జట్టు మార్చి 5న ముంబైలో ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో భారత్ ప్రదర్శన ఎలా ఉంటుందో.. ఆమిర్ చేసిన విమర్శల్లో ఎంత నిజముందో తేలిపోనుంది. ఒకవైపు పాక్ ప్లేయర్లకు పీసీబీ భారీ జరిమానాలు విధిస్తుంటే.. మరోవైపు ఆమిర్ వంటి మాజీలు భారత్‌పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+