రోహిత్ శర్మ తేడా వస్తే తాటా తీస్తాడు : షమీ

కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ శర్మ, కెప్టెన్‌గా కూడా తనదైన మార్క్ చూపించాడు. ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మకు మంచి రికార్డు ఉంది. ఇదే సమయంలో ఇంటర్నేషన్ క్రికెట్‌లో కూడా రోహిత్ శర్మ తన ముద్ర వేశాడు. ధోని తర్వాత టీ20 వరల్డ్ కప్‌ను భారత్‌కు అందించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.

ఇదే సమయంలో వన్డే వరల్డ్ కప్‌ టోర్ని, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో జట్టును ఫైనల్స్‌కు చేర్చడంలో రోహిత్ శర్మ పాత్ర ఎంతో ఉంది. తాజాగా రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి స్పందించాడు. రోహిత్ కెప్టెన్సీపై షమి ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్ అని, ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తాడని అన్నాడు. అయితే కాస్త తేడా వచ్చినా ఊరుకోడని షమీ చెప్పుకొచ్చాడు. రోహిత్‌ శర్మలో ఉన్న అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే.. అతడు ఆటగాళ్లకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడు, బాగా ప్రోత్సహిస్తాడు.

mohammed shami comment on rohit sharma captaincy

కానీ ఏమాత్రం తేడా వచ్చినా అస్సలు ఊరుకోడు. ఒకవేళ తప్పు జరిగిందంటే అతడు గ్రౌండ్‌లోనే ఆగ్రహం వ్యక్తం చేస్తాడని షమీ తెలిపాడు. నీ నుంచి ఇలాంటి ప్రదర్శన ఆశిస్తున్నా.. కానీ అలా చేయడం లేదంటూ మొహం మీదనే చెప్పేస్తాడు. అప్పుడు కూడా సెట్ అవ్వకపోతే రియాక్షన్స్ దారుణంగా ఉంటాయి. ఆ టైమ్ లో రోహిత్ ఎలా ఉంటాడో స్క్రీన్స్ లో చూస్తూనే ఉంటాం. హిట్ మ్యాన్ రియాక్షన్స్‌ను చూసే అక్కడేం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు అని షమి చెప్పుకొచ్చాడు.

షమీ వ్యాఖ్యలతో టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ కూడా అంగీకరించాడు. రోహిత్ శర్మతో కలిసి చాలాకాలంగా ఆడటం వల్ల అతను ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో తెలిసిపోతుందంటూ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. సహచర ప్లేయర్ల నుంచి అతడు ఏం కోరుకుంటున్నాడనేది తమకు అర్థం అవుతుందన్నాడు అయ్యర్. దీనిపై స్పందించిన రోహిత్ శర్మ..తోటి ఆటగాళ్లకు తాను పూర్తి స్వేచ్చనిస్తానని, ముందు తాను నచ్చినట్టు ఉంటే వాళ్లు కూడా అలాగే ఉంటారనే ఉద్దేశంతో గ్రౌండ్‌లో సరదాగా ఉంటానని రోహిత్ తెలిపారు. ఒక్కోసారి పరిస్థితులను బట్టి సీరియస్ అవుతుంటానని పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+