సానియా మీర్జా‌తో పెళ్లి..మొత్తానికి ఓపెన్ అయిన షమీ

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వైవాహిక జీవితం విషాదాంతంగా ముగిసిన సంగతి అందరికి తెలిసిందే. సానియా మీర్జా తన 15 ఏళ్ల దాపంత్య జీవితానికి గుడ్ చెప్పింది. భర్త షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవడంతో .. అతనితో సానియా మీర్జా బంధం తెగిపోయినట్టు అయింది. షోయబ్ మాలిక్ పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ ఎఫైర్ పెట్టుకున్నాడని..ఆ కారణంగానే సానియా మీర్జాతో అతను దూరంగా ఉంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ వార్తలను నిజం చేస్తూ సనా జావేద్‌‌ను షోయబ్ పెళ్లాడాడు. ఇదిలా ఉంటే సానియా మీర్జా కూడా మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ వార్తలొస్తున్నాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ మొహమ్మద్‌ షమీ , సానియా మీర్జా ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై షమీ స్పందించారు. ఆ పుకార్లకు షమీ పుల్‌స్టాప్‌ పెట్టేశాడు. అలాంటిదేం లేదని.. అవన్నీ జస్ట్‌ రూమర్స్‌ అంటూ కొట్టిపారేశాడు. తన జీవితం ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉందని, ఎవరో ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి వెళ్లినంత మాత్రనా అంత సర్వనాశనం కాదని, తనతో తన కూతురి, తల్లి కుటుంబం అంతా ఉన్నారని షమీ పేర్కొన్నాడు.

mohammed shami open about marriage with sania mirza

షమీ తన భార్య హసిన్ జహాన్‌తో విడిపోయిన విషయం తెలిసిందే. షమీపై ఆమె ఎన్నో ఆరోపణలు చేసి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత షమీ ఒంటరిగానే ఉంటున్నాడు. ఇక షమీ కెరీర్ విషయానికి వస్తే..అతడు ప్రస్తుతం గాయం నుంచి కొలుకుంటున్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత.. గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్‌ సాధిస్తున్నాడు. త్వరలో టీమిండియా ఆడబోయే టెస్టు సిరీస్‌లతో షమీ కమ్‌బ్యాక్‌ ఇచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+