MS Dhoni: ఐపీఎల్‌కు ముందు బౌలర్లకు వార్నింగ్.. హెలికాప్టర్ షాట్ అదుర్స్.. వీడియో వైరల్
MS Dhoni Helicopter Shot: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2025)కు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు అన్ని జట్లు ప్రాక్టీస్ లో మునిగిపోయాయి. ఈ సారి ఎలాగైనా ట్రోఫీని సాధించాలని కఠోర సాధన చేస్తున్నాయి. ఆటగాళ్లు నెట్స్ లో చెమటలు కక్కేలా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ మార్చి 22న కోల్‌కతాలో జరగనుంది. ఇదిలా ఉండగా.. అత్యంత విజయవంతమైన ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 23న ముంబై ఇండియన్స్ తో తన తొలి మ్యాచ్ ను ఆడనుంది.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన భారత లెజెండ్ ఎంఎస్ ధోని ఐపీఎల్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐదు సంవత్సరాల క్రితం రిటైర్ అయినా ఇంకా ఐపీఎల్ లో తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు ఈ లెజెండ్. దీన్ని బట్టి ధోని ఫిట్ నెస్ ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఎంఎస్ ధోని ఐపీఎల్ 2025 కోసం సిద్దమవుతున్నాడు. దీనిలో భాగంగా చెన్నైలో చెపాక్ స్టేడియంలో భారీ షాట్లు ఆడుతున్నాడు. గత ఇన్నింగ్స్ ధనాధన్ ఇన్నింగ్స్ తో ఉర్రూతలూగించిన ఎంఎస్ ధోనీ.. ఈ సీజన్ లో కూడా ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు.

ధోనీ అనగానే గుర్తొచ్చేది హెలికాప్టర్ షాట్. ఆ షాట్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ధోనీ ఆ షాడితే ఫ్యాన్స్ మైమరిచిపోతారు. ఐపీఎల్ 2025 కోసం సిద్ధమవుతున్న మిస్టర్ కూల్.. మరోసారి తన సిగ్నేచర్ షాట్ ను బయటపెడుతున్నాడు. తాజాగా శ్రీలంక పేసర్ పతిరానా బౌలింగ్లో ధోని హెలికాప్టర్ షాట్ ఆడాడు. పతిరానా మహీకి యార్కర్ వేయడానికి ప్రయత్నించగా.. ఆ బంతిని హెలికాప్టర్ షాట్ ఆడి బౌండరీకి తరలించాడు ఎంఎస్ ధోని. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో నిలబడిన రవిచంద్రన్ అశ్విన్ కూడా తన చిరునవ్వును అదుపు చేసుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వింటేజ్ ధోనీ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. 43 ఏళ్ల వయస్సులోనూ పవర్ ఫుల్ హిట్టింగ్ చేస్తున్న ధోనీని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో బౌలర్లకు ధోని చుక్కలు చూపిస్తాడని కామెంట్లు వస్తున్నాయి.
ఎంఎస్ ధోని ఐపీఎల్ కెరీర్
43 ఏళ్ల ఎంఎస్ ధోని 2008 నుంచి ఐపీఎల్ లో భాగంగా ఉన్నాడు. ఎంఎస్ ధోనీ మొదటి సీజన్ నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. ధోని ఇప్పటివరకు 264 ఐపీఎల్ మ్యాచ్ లలో 5243 పరుగులు చేశాడు. 137.5 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఇప్పుటివరకు ఐపీఎల్ లో ధోని బ్యాట్ నుంచి 24 అర్థ సెంచరీలు వచ్చాయి. వికెట్ కీపర్ గా మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ లో 152 క్యాచ్ లు, 24 రనౌట్లు, 42 స్టంపింగ్ లు తీసుకున్నాడు.
MS Dhoni with a helicopter shot. 🚁pic.twitter.com/blUh0h4fwy
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2025












Click it and Unblock the Notifications