IPL ఫ్యాన్స్ కు బిగ్ షాక్ - మ్యాచులకు దూరంగా ధోనీ, CSK అధికారిక ప్రకటన..!!
IPL 2026: అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది. శనివారం ఆరంభమయ్యే 19వ సీజన్ మే 31 వరకు జరుగనుంది. మొత్తంగా 10 జట్లు లీగ్‌లో తలపడనుండగా, 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో 4 ప్లేఆఫ్స్ ఉంటాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. అయితే, CSK స్టార్ ప్లేయర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
ఐపీఎల్ 2026 సమరం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సారి జరిగే ఐపీఎల్ పైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రారంభం రోజునే క్రికెట్ ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్. CSK స్టార్ ప్లేయర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నారు. సీఎస్కే యాజమాన్యం ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది. టీం మేనేజ్ మెంట్ వెల్లడించిన సమాచారం మేరకు ధోనీ ప్రాక్టీసు సెషన్ లో గాయానికి గురయ్యాడు. ఈ గాయం కారణంగా కనీసం తొలి రెండు వారాల పాటు మ్యాచులకు దూరంగా ఉండనున్నాడు. దీంతో సీజన్ ఆరంభంలోనే చెన్నై జట్టు పెద్ద పరీక్షను ఎదుర్కొనాల్సి వస్తోంది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని ప్రచారం సాగుతున్న వేళ.. దాదాపు రెండు వారాల పాటు ధోనీ లేకుండానే చెన్నై టీం కీలక మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.

ధోనీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మ్యాచ్ చివరి క్షణాల్లో ఆటను పూర్తిగా మార్చేసే శక్తి ధోనీ సొంతం. అలాంటి ప్లేయర్ లేకపోవడం జట్టుకు ఖచ్చితంగా లోటే. అయితే ఇదే టైమ్‌ను అవకాశంగా మార్చుకునేందుకు జట్టులోని యువ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. మిస్టర్ కూల్ త్వరగా కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులకు కోరకుంటున్నారు. కొద్ది రోజులుగా ధోనీ ఈ ఐపీఎల్ లో ఆడటం పైన సందేహాలు నెలకున్నాయి. ప్రాక్టీసు సెషన్ లోనూ ధోనీ కొంత అసౌకర్యం గా కనిపించారు. చురుగ్గా ఉండే ఎంఎస్ ధోనీ ఇలా కుంటుతూ కనిపించడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
Official Statement
— Chennai Super Kings (@ChennaiIPL) March 28, 2026
MS Dhoni is currently undergoing rehabilitation for a calf strain. As a result, he is likely to miss the first two weeks of TATA IPL 2026.
Get well soon, Thala! 💛🦁 pic.twitter.com/4dgmt5EWFi
గత కొన్ని సీజన్ల నుంచి ఎంఎస్ ధోనీ తన ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా చివర్లో ఫినిషర్‌గా వస్తున్నాడు. కాగా, ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు చెన్నై యాజమాన్యం ధోనీ రెండు వారాల పాటు ఐపీఎల్ మ్యాచులకు దూరంగా ఉంటారని అధికారికంగా ప్రకటించటం.. ఫ్యాన్స్ కు షాకింగ్ గా మారింది. ధోనీ త్వరగా తిరిగి జట్టులోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
-
Praful Hinge: బుడ్డోడినే గోల్డెన్ డకౌట్ చేసాడు.. ఎవరీ SRH నయా పేసర్..? -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
Ishan Kishan: రాజస్థాన్ మ్యాచ్ తెచ్చిన మార్పు-ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం..! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!! -
ధురందర్ 2 కంటే లాంగ్ మ్యాచ్! ఐపీఎల్లో సరికొత్త రికార్డు -
Jasprit Bumrah:బుమ్రాకు ఏమైంది..ఆందోళనలో ఫ్యాన్స్..!! -
ఎంత సీఎం అయినా.. !! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
హార్దిక్ అవుట్ తో కృనాల్ వైల్డ్ సెలబ్రేషన్స్- ఆ వివాదమే అసలు కారణమా..!? -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
ట్రాక్ ఎక్కేశాడు- కాచుకోండి ఇక











Click it and Unblock the Notifications