ముంబై వీక్ నెస్ అదే.. అధిగమిస్తేనే ఫైనల్ ఛాన్స్
IPL 2025 Qualifier 2: ఐపీఎల్ 2025.. క్వాలిఫయర్ 2 ఉత్కంఠభరితంగా మారింది. టైటిల్ హాట్ ఫేవరెట్ గా ఉంటూ వచ్చిన గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ దశలోనే తిరుగుముఖం పట్టడంతో సమీకరణాలు, అంచాలన్నీ తారుమారు అయ్యాయి. ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్ 2 అడుగుపెట్టడం.. ఈ సిరీస్ ను మరింత రసవత్తరంగా మార్చింది.
ఈ సాయంత్రం క్వాలిఫయర్ 2 గేమ్ జరుగనుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ బిగ్ గేమ్ కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఢీ కొట్టబోతోంది ముంబై ఇండియన్స్. ఇందులో గెలిచిన జట్టు మంగళవారం జరిగే ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది.

పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లల్లో ఏ జట్టు ఫైనల్స్ కు చేరుతుందనేది ఈ రాత్రికి తేలిపోతుంది. ముల్లాన్ పూర్ లో శుక్రవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను మట్టికరిపించింది.
తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. దీన్ని కొట్టలేకపోయింది గుజరాత్. ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులే చేయగలిగింది. ఈ గెలుపు ముంబై ఇండియన్స్ లో జోష్ నింపింది. స్కోర్ బోర్డుపై భారీగా పరుగులు సమకూర్చడం ప్లస్ పాయింట్.
దాదాపుగా ఆ జట్టు టాప్ టు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ మొత్తం ఫామ్ లో ఉన్నట్టే. బౌలింగ్ లో ఫర్వాలేదనిపించుకుంటోంది. మిడిల్ ఓవర్లల్లో వికెట్లను త్వరగా పడగొట్టలేకపోవడం మైనస్ పాయింట్. దాని వల్లే గుజరాత్ టైటాన్స్ 208 పరుగులు చేయగలిగింది. ధీటుగా నిలువగలిగింది.
67 పరుగుల వద్ద రెండో వికెట్ పడగా.. మళ్లీ 151 పరుగుల వరకు మరో బ్యాటర్ ను అవుట్ చేయలేకపోవడం.. ముంబై బౌలింగ్ వీక్ నెస్ కు అద్దం పట్టింది. ఆ తరువాత వికెట్లు వెంటవెంటనే పడగొట్టగలిగారు బౌలర్లు. మిడిల్ ఓవర్లల్లో పరుగులను కట్టడి చేయడం, త్వరగా బ్యాటర్లను పెవిలియన్ దారి పట్టించడంపై ఇప్పటికే కసరత్తు చేశామని హెడ్ కోచ్ మహేల జయవర్ధనె, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే వెల్లడించారు.
ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీసుకున్నప్పటికీ.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 14 ఎకానమితో 56 పరుగులు ఇచ్చాడు. రిచర్డ్ గ్లీషన్, హార్దిక్ పాండ్యాదీ అదే పరిస్థితి. ఓవర్ కు 11కు పైగా పరుగులు ఇచ్చుకున్నారీ ఇద్దరు బౌలర్లు. దీన్ని నియంత్రించుకోవడంపై ముంబై దృష్టి పెట్టకపోతే.. పంజాబ్ బ్యాటర్ల ధాటికి తలవంచక తప్పని పరిస్థితి రావొచ్చు.
ముంబై ఇండియన్స్ తుదిజట్టులో- రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కేప్టెన్), నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, రాజ్ బావా, రిచర్డ్ గ్లీసన్/రీస్ టోప్లే, జస్ ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, అశ్వని కమార్ ఆడొచ్చు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications