ముస్తాఫిజుర్ రెహమాన్ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్, వాట్ నెక్స్ట్..!!
T20 World cup: ముస్తాఫిజుర్ రెహమాన్. ఇప్పుడు క్రికెట్ లో చర్చకు కారణమైన బంగ్లాదేశ్ ఆటగాడు. బంగ్లాదేశ్ లో హిందువుల పై జరగుతున్న దాడులకు నిరసనగా ఆ దేశానికి చెందిన క్రికెటర్లను ఐపీఎల్ ఆడనీయద్దంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో, కేకేఆర్ టీంలో ఉన్న ముస్తాఫిజుర్ రెహమాన్ ను బీసీసీఐ ఆదేశాలతో టీం యాజమాన్యం వదులుకుంది. దీంతో, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతున్న వేళ.. ఆసక్తి కర నిర్ణయం ప్రకటించింది.
టీ20 ప్రపంచ కప్ కోసం ఇప్పుడు ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటికే భారత్ తో సహా పలు టీంలను ప్రకటించారు. తాజాగా బంగ్లాదేశ్ టీం ను సైతం ఫైనల్ చేసారు. లిటన్ దాస్ కెప్టెన్‌గా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ 2026(IPL)లో చోటు కోల్పోయిన ముస్తాఫిజుర్ రెహమాన్ కు ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించారు. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారంలో తీసుకున్న నిర్ణయంతో బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారం చేయమని చెబుతోంది. ఈ నిర్ణయం తమకు అవమాన కరంగా భావిస్తోంది. ఇది రెండు దేశాల సంబంధాల పైన ప్రభావం పడే అంశంగా మారుతోంది. అయితే, ఇప్పటికే షెడ్యూల్ సైతం ఖరారు చేసారు. తుది జట్టులో ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఎంపిక చేసారు.

ఈ టోర్నీలో బంగ్లాదేశ్ టీంలో ముస్తాఫిజుర్, తస్కిన్ అహ్మద్ పేస్ విభాగంలో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. మెహదీ హసన్, రిషాద్ హొస్సేన్‌ను ప్రధాన స్పిన్నర్లుగా తీసుకున్నారు. బ్యాటింగ్‌లో లిటన్ దాస్, తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్‌పై బంగ్లా ఎక్కువగా ఆధారపడనుంది. గ్రూప్ స్టేజీలో బంగ్లాదేశ్ ఆడాల్సిన నాలుగు మ్యాచులను భారత్‌లోనే షెడ్యూల్ చేశారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్(ఫిబ్రవరి 7), ఇటలీ(ఫిబ్రవరి 9), ఇంగ్లండ్(ఫిబ్రవరి 14), నేపాల్ (ఫిబ్రవరి 17) మ్యాచులు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ జట్టు గ్రూప్ 'సి'లో ఇంగ్లండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీ జట్లతో తలపడనుంది. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. ఫిబ్రవరి 21 నుంచి సూపర్ 8 మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. సూపర్ 8 దశ అనంతరం టాప్-4 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్ కోల్‌కతా, కొలంబో, ముంబైలో జరగనుండగా, ఫైనల్ మార్చి 8న అహ్మదాబాద్ లేదా కొలంబోలో నిర్వహించే విధంగా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications