షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌ దంపతులు విడిపోయి చాలా కాలమే అయినా, వీరిద్దరూ వార్తల్లో నిలవడం మాత్రం తగ్గలేదు. తాజాగా నటాషా తన మాజీ అత్తగారిని కలవడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకున్న తర్వాత నటాషా తన కొడుకు అగస్త్యతో కలిసి తన సొంత దేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే కొడుకు భవిష్యత్తు కోసం హార్ధిక్, నటాషా తరుచగా టచ్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే నటాషా తాజాగా వడోదరలోని హార్దిక్ పాండ్యా నివాసానికి వెళ్లారు. అక్కడ తన మాజీ అత్తగారితో పాటు హార్ధిక్ సోదరుడు కృనాల్ పాండ్యా కుటుంబంతో కలిసి నటాషా సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.

విడాకుల తర్వాత మళ్లీ ఒక్కటవుతున్నారా?
హార్దిక్ పాండ్యా కుటుంబంతో నటాషా అంత క్లోజ్‌గా ఉండటం చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. హార్దిక్ ఇటీవలే తన కొడుకు అగస్త్యకు ఓ ఖరీదైన 'డిఫెండర్' కారును బహుమతిగా ఇచ్చారు. ఆ కారును తీసుకోవడానికి కూడా నటాషా స్వయంగా వెళ్లారు. ఇప్పుడు కుటుంబం మొత్తంతో ఆమె కలిసి ఉండటం చూస్తుంటే.. కొడుకు కోసం వీరిద్దరూ మనస్పర్థలు వీడి మళ్ళీ ఒక్కటయ్యే అవకాశం ఉందేమోనని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. "పిల్లల కోసం ఇలా కలిసి ఉండటం నిజంగా గొప్ప విషయం" అంటూ కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం హార్దిక్-నటాషాల రీ-యూనియన్ పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు.

Natasa Stankovic Meets Hardik Pandya Family Again Reunion Buzz After Divorce Goes Viral

మహికా శర్మతో హార్దిక్ డేటింగ్ మధ్యలో కొత్త ట్విస్ట్
మరోవైపు గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యా తన కొత్త గర్ల్ ఫ్రెండ్ అని ప్రచారం జరుగుతున్న మహికా శర్మతో వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో నటాషా మళ్లీ హార్దిక్ ఇంటికి వెళ్లడం ఈ కథలో కొత్త ట్విస్ట్ ఇచ్చింది. నటాషా కేవలం కొడుకు అగస్త్య కోసమే పాండ్యా కుటుంబంతో బంధాన్ని కొనసాగిస్తోందా? లేక వీరిద్దరి మధ్య పాత బంధం మళ్ళీ చిగురిస్తోందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నటాషా పోస్ట్‌పై సోషల్ మీడియాలో రచ్చ
నటాషా స్టాంకోవిచ్‌ షేర్ చేసిన ఫోటోలపై సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. ఓ వర్గం వారు ఇది కేవలం 'మెచ్యూర్డ్ పేరెంటింగ్' అని, విడిపోయినా కొడుకు కోసం గౌరవప్రదంగా కలిసి ఉండటం మంచి పరిణామం అని అంటున్నారు. మరో వర్గం వారు మాత్రం, కుటుంబ సభ్యులందరూ అంత సంతోషంగా ఫోటోలకు పోజులివ్వడం చూస్తుంటే, మహికా శర్మ కంటే నటాషాకే ఆ ఇంట్లో ఎక్కువ ప్రాధాన్యత ఉందని.. త్వరలోనే వీరు అధికారికంగా కలిసిపోయే ఛాన్స్ ఉందని జోస్యం చెబుతున్నారు. ఏదేమైనా ఈ ఫోటోలు మాత్రం ప్రస్తుతం నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+