విడాకులపై మరో బాంబు పేల్చిన హార్దిక్ పాండ్యా భార్య
గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యా విడాకుల గురించే విపరీతమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యాకు అతని భార్య నటాషా విడాకులు ఇవ్వడానికి రెడీ అయిందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు ఇలా చర్చించుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. మార్చి 4 నటాషా పుట్టినరోజు. ఆ రోజు, హార్దిక్ పాండ్యా తన భార్యకు సోషల్ మీడియాలో ఒక్క పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా పోస్ట్ చేయలేదు.
దీనికి తోడు నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పాండ్యా అనే ఇంటిపేరును తొలగించింది. దీంతో నటాషా హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇవ్వడం ఖాయమనే అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేసింది. 'ఒకరు రోడ్డున పడబోతున్నారు' అనే క్యాప్షన్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఫొటో షేర్ చేసింది. ఈ పోస్ట్ హార్దిక్ పాండ్యను ఉద్దేశించి పెట్టిందంటూ నెట్టింట రచ్చ మొదలు పెట్టారు నెటిజన్లు.

ఆ తర్వాత నటాషా మరో ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేసింది.''జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉంటాం. నిరుత్సాహపడతాం. అలాంటివేళ ఎవరూ తోడుగా లేరని బాధ పడనవసరం లేదు. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. మనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. దానిగురించి భగవంతుడి వద్ద ఓ ప్రణాళిక ఉంటుంది'' అంటూ నటాషా ఓ వీడియోను పోస్టు చేశారు.
దీంతో వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకుంటారని వస్తున్న వార్తలకు మరింత ఊతమిచ్చినట్లయింది. ఇటీవల జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచ కప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్‌తో భారత విజయంలో హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భర్త హార్దిక్ పాండ్యా ప్రదర్శనపై నటాషా ఇప్పటివరకు స్పందించలేదు. ఆయనకు సంబంధించిన ఒక్క పోస్టు కూడా పెట్టలేదు.
ఇక తాజాగా అంబానీ ఇంట జరిగిన పెళ్లికి సైతం హార్దిక్ ఒంటరిగానే రావడంతో నటాషాతో విడాకులు ఖాయమని అంతా భావిస్తున్నారు. దీంతో నెటిజన్లు గట్టిగానే నటాషాపై ట్రోలింగ్‌కు దిగారు. దీనిపై నటాషా రియాక్ట్ అవుతూ షాకింగ్ వీడియో ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొంతమంది జనాలు ఏమీ తెలియకుండా, తెలుసుకోకుండా ఒకరిని జడ్జ్ చేస్తూ ఉంటారు. అసలు ఒక సంఘటన గురించి ఏమీ తెలుసుకోకుండా ఊహించుకుంది మాట్లాడుతారు. కానీ డైరెక్ట్‌గా జడ్జ్ చేస్తూ అపార్థం చేసుకుని ఇతరుల జీవితాల మాట్లాడుతుంటారు.
అలాగే ఒక వ్యక్తి గురించి ఏదైనా రూమర్ వస్తే అది నిజమా? కాదా అని తెలుసుకోకుండా కనీసం సానుభూతి కూడా చూపించకుండా జడ్జ్ చేసి మాట్లాడుతారని నటాషా చెప్పుకొచ్చింది.విడాకుల గురించి పూర్తిగా ఏం జరిగిందో తెలియకుండా అందరూ తనదే తప్పు అని మాట్లాడుతున్నార వారికి ఆమె ఈ వీడియో ద్వారా కౌంటరిచ్చింది. ఈ వీడియోతో విడాకులను ఆమె మరోసారి కన్ఫర్మ్ చేసినట్టు అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications