ఎంతమందిని మారుస్తావ్ తల్లీ.. కొత్త ప్రియుడుతో హార్దిక్ పాండ్యా మాజీ భార్య
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా వివాహిక జీవితం గురించి అందరికి తెలిసిందే. హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.ఓ పార్టీలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో ఈ జంట పెళ్లి వరకు తమ బంధాన్ని తీసుకువెళ్లారు. అయితే పెళ్లికి ముందు రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు.. పెళ్లికి ముందే కమిట్ అయ్యారనే ప్రచారం జరిగింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. హార్దిక్ పాండ్యా,నటాషా స్టాంకోవిచ్‌లు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే నటాషా తల్లి కాబోతుందనే వార్త బయటకు వచ్చింది.
కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తాయి.దీంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు అనంతరం నటాషా తన కుమారుడు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వెళ్లిపోయారు.దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే నటాషా ఇటీవలే తిరిగి ఇండియాకు రావడం జరిగింది. కొడుకు అగస్త్యను తీసుకుని ఇండియాకు వచ్చారు నటాషా. ఇండియాకు వచ్చిన నటాషా ముంబై విధుల్లో తిరుగుతూ కనిపించారు. ఆమెతోపాటు బాయ్‌ఫ్రెండ్ అలెక్సాండర్ ఇలాక్ కూడా ఉండటం గమనార్హం. వీరిద్దరూ ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే నటాషా అలెక్సాండర్ ఇలాక్‌కు బ్రేకప్ చెప్పిందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. హార్దిక్‌తో విడాకుల తర్వాత నటాషా మరోసారి ప్రేమలో పడిందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.హార్దిక్‌తో విడిపోయిన తర్వాత అలెక్సాండర్‌తో డేటింగ్ చేసింది. అయితే తాజాగా అతనికి బ్రేకప్ చెప్పి, మరో కొత్త ప్రియుడును లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఆమె బిగ్‌బాస్ విన్నర్‌తో తరచూ కనిపిస్తోంది.ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ OTT విజేత ఎల్విష్ యాదవ్‌తో నటాషా డేటింగ్ చేస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి.అందుకు తగ్గట్టగానే వీరిద్దరు కలిసి తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Birthday gift for Hardik Pandya by his ex wife Natasa Stankovic #ElvishYadav𓃵 #HardikPandyaWife pic.twitter.com/AILaxAtd6V
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) October 12, 2024
నటాషా, ఎల్విష్ కు సంబంధించి ఒక వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది. అందులో ముంబైలోని ఓ హోటల్ ముందు ఎల్విస్, నటాషా కారు దిగుతున్నట్లు ఉంది.అయితే వీరిద్దరూ ఒకే కారులో దిగుతూ కనిపించారు.అయితే ఇద్దరూ విడివిడిగా వెళ్లేందుకు ప్రయత్నించారు. నటాషా తన వెనక వస్తుందో లేదో పలుసార్లు వెనక్కి తిరిగి చూశాడు ఎల్విష్. ఈ వీడియోపై హార్దిక్ పాండ్యా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆమెతో కలిసి ఉండటం కన్నా, విడిపోవడమే మంచిదని హార్దిక్ పాండ్యాకు అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే హార్దిక్ పాండ్యాతో విడాకులు తర్వాత నటాషా మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆమె ఒక ఆల్బమ్ సాంగ్‌లో కనిపించింది.












Click it and Unblock the Notifications