చరిత్ర తిరగరాసిన గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా.. కానీ జస్ట్ మిస్ !

భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మళ్లీ ఓ చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దోహాలో జరిగిన డైమండ్ లీగ్ 2025 పోటీలో 90.23 మీటర్ల జావెలిన్ త్రో చేసి తన సొంత జాతీయ రికార్డును తిరగరాశాడు. దీంతో ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న 90 మీటర్ల మార్క్‌ను తొలిసారిగా అందుకున్నాడు. ఈ అద్భుత త్రోతో గతంలో తన పేరిట ఉన్న జాతీయ రికార్డు అయిన 89.94 మీటర్ల (స్టాక్‌హోమ్, 2022) మార్కును అధిగమించాడు.

జస్ట్ మిస్..

ఇక ఈ పోటీల్లో తన మొదటి త్రోలో 88.44 మీటర్లు విసిరిన నీరజ్, రెండవ త్రోలో ఫౌల్ అయ్యాడు. కానీ మూడవ త్రోలో 90.23 మీటర్లకు బల్లెం దూసుకెళ్లింది. నాలుగవ త్రోలో 80.56 మీటర్లు మాత్రమే నమోదయ్యాయి. ఐదవ ప్రయత్నం మళ్లీ ఫౌల్ కాగా, ఆఖరి త్రోలో 88.20 మీటర్లకు పరిమితమయ్యాడు. అయితే చివరి వరకు టాప్‌లో ఉన్న నీరజ్‌ను జర్మనీకి చెందిన జులియన్ వెబర్ చివరి ప్రయత్నంలో ఓటమికి గురిచేశాడు. ఆరో త్రోలో వెబర్ 91.06 మీటర్ల దూరం బల్లెం విసిరి విజేతగా నిలిచాడు. ఇది వెబర్ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. అలానే అండర్సన్ పీటర్స్ (85.64 మీ) మూడవ స్థానం సాధించాడు.

neeraj-chopra-records-90-metres-throw-in-diamond-league-2025

నీరజ్ చోప్రా టాప్-5 త్రోలు (2025 వరకు)..

1. 90.23 మీటర్లు - దోహా డైమండ్ లీగ్ 2025

2. 89.94 మీటర్లు - స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్ 2022

3. 89.49 మీటర్లు - లౌసాన్ డైమండ్ లీగ్ 2024

4. 89.45 మీటర్లు - పారిస్ ఒలింపిక్స్ 2024 (ఫైనల్)

5. 89.34 మీటర్లు - పారిస్ ఒలింపిక్స్ 2024 (క్వాలిఫైయర్)

నీరజ్ సాధించిన ఘనతలు..

టోక్యో ఒలింపిక్స్ 2021 - స్వర్ణ పతకం

డైమండ్ లీగ్ విజేత - 2022

వరల్డ్ అథ్లెటిక్స్ గోల్డ్ మెడల్ - 2023

ఆసియా గేమ్స్ స్వర్ణ పతకం - 2023

జూనియర్ వరల్డ్ ఛాంపియన్ - 2016

పద్మశ్రీ అవార్డు - 2022

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+