సానియా మీర్జా సంచలన పోస్ట్..దుమ్మెత్తిపోస్తున్న భారత్ అభిమానులు
పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి తర్వాత ఇండియా , పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది భారత్ ఆర్మీ. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. ఈ ఘటనపై సానియా మీర్జా రియాక్ట్ అయ్యారు. పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'ను ఆమె సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదే మా దేశం" అంటూ సానియా మీర్జా ఒక శక్తివంతమైన చిత్రాన్ని పంచుకున్నారు. ఆ ఫొటోలో కల్నల్ సోఫియా ఖురేషి ,వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అనే ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. విశేషం ఏమిటంటే, కల్నల్ సోఫియా ఒక ముస్లిం కాగా, వింగ్ కమాండర్ వ్యోమికా సిక్కు. వీరిద్దరి పక్కనే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి (కశ్మీరీ పండిట్) కూడా ఉండటం ఆ ఫోటోలోని ఐక్యతను మరింతగా చాటిచెబుతోంది.సానియా మీర్జా ఈ ఫోటోను షేర్ చేస్తూ, భారతదేశం యొక్క బలం దాని భిన్నత్వంలోనే ఉందని గట్టిగా చాటిచెప్పారు.

ఆ తర్వాత ఇండియా, పాక్ మధ్య యుద్ధం జరగడం, అందులో రెండు దేశాలకు చెందిన వారు నష్టపోవడం జరిగింది. అమెరికా జోక్యంతో ఇరు దేశాలు కూడా కాల్పులు విరమణ చేస్తున్నట్టు ప్రకటించాయి. భారత్,పాక్ కాల్పుల విరమణపై సానియా మీర్జా స్పందించారు. ఆమె తన పోస్ట్‌లో ఇలా చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. యుద్ధం ద్వారా కాకుండా దౌత్యంతో సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆమె పేర్కొన్నారు.శాంతి ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందంటూ తన ఇన్‌స్టాలో స్టోరీలో పోస్ట్ చేశారు సానియా. అయితే సానియా పోస్ట్‌పై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాకిస్తాన్ మాజీ కోడలు భారత్‌కు శాంతి పాఠం నేర్పుతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.మరికొందరు ఆమె మాజీ భర్త పాకిస్థాన్‌లో ఉన్నాడని , అందుకే అతని దేశం పట్ల సానియాకు అంత ప్రేమ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం సానియా చెప్పిన విషయంలో ఎలాంటి తప్పు లేదని, ఆమె భారత్‌పై ప్రేమతోనే అలా మాట్లాడి ఉంటారని సానియాకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి సానియా మీర్జా భారత్‌కు మద్దతుగా మాట్లాడిన ఆమెను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించడం ఇప్పుడు సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications