ఇంత దిగజారిపోతావ్ అనుకోలేదు కోహ్లీ..!

విరాట్ కోహ్లీ గురించి కొత్తగా చెప్పాడానికి ఏం లేదు.భారత క్రికెట్‌లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఆటగాడు. తన అంకితభావం, అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులను సృష్టించి, లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఆటపరంగా అతనికి ఎలాంటి వంక పెట్టలేం. అయితే, ఒక్కోసారి మైదానంలో అతని సంబరాలు, భావోద్వేగాలు హద్దులు మీరి వివాదాలకు దారి తీస్తుంటాయి. ప్రత్యర్థులు ఔటైనప్పుడు, లేదా జట్టు విజయం సాధించినప్పుడు కోహ్లీ ప్రవర్తన ఒక్కోసారి శ్రుతిమించుతుందని తరచు విమర్శలు వస్తుంటాయి.

తాజాగా ఐపీఎల్ 2025లో జరిగిన ఒక సంఘటన మరోసారి కోహ్లీని వివాదంలోకి నెట్టింది. ఐపీఎల్ 2025 తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన పోరులో RCB అద్భుత విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. బౌలింగ్, బ్యాటింగ్‌లలో పంజాబ్‌ను పూర్తిగా చిత్తుచేసి, 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ భారీ విజయం RCB అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. అయితే, ఈ ఆనందం మధ్యే విరాట్ కోహ్లీ ప్రవర్తన మరో వివాదానికి కారణమైంది.

Netizens troll Kohli viciously over Mushir Khan s issue

మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో 8వ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ముషీర్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. ముషీర్ బ్యాటింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో, విరాట్ కోహ్లీ స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ కనపించాడు. ఈ సమయంలో కోహ్లీ, ముషీర్‌ను ఉద్దేశించి హావ్ భావాలతో పాటు కొన్ని వ్యాఖ్యలు (స్లెడ్జింగ్) చేశాడు. వాటర్ బాయ్‌ను బ్యాటింగ్‌కు దించారంటూ కోహ్లీ వెటకారం చేశాడు . ఓ యువ ఆటగాడిని ఉద్దేశించి కోహ్లీ ఇలా ప్రవర్తించడం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది.

ముషీర్ ఖాన్ మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నప్పుడు, అనుభవజ్ఞుడైన కోహ్లీ ఇలా ప్రవర్తించడం సరికాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆటలో ఆవేశం సహజమే అయినప్పటికీ, మైదానంలో విరాట్ కోహ్లీ ప్రవర్తన ఒక్కోసారి వివాదాలకు దారి తీస్తోంది. ఈ ఘటనతో చాలామంది ఐపీఎల్ ఫైనల్‌లో కోహ్లీ జట్టైనా ఆర్సీబీ ఓడిపోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+