ఇంటి దారి పట్టిన బ్రెజిల్: రెడ్ ఆర్మీ ముందు తలవంచిన నెయ్‌మార్- మెయిన్ హీరో అతడే

ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ లో ఓ సంచలనం విజయం నమోదైంది. అయిదుసార్లు ఛాంపియన్‌ జట్టు బ్రెజిల్‌ ఇంటిదారి పట్టింది. 2-1 తేడాతో నార్వే చేతిలో ఓటమిపాలైంది. న్యూయార్క్‌ మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32లో నార్వే ఈ చారిత్రక విజయాన్ని అందుకుంది. స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ చివరి నిమిషాల్లో చేసిన రెండు గోల్స్‌.. బ్రెజిల్ పరాజయాన్ని శాసించాయి. ఈ విజయంతో నార్వే ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ఫిఫా రౌండ్ ఆఫ్ 16లో ఎంట్రీ ఇవ్వడం నార్వే జట్టుకు ఇదే మొదటిసారి.

మ్యాచ్ ప్రారంభం నుంచే రెండు జట్లూ దూకుడుగా ఆడాయి. మ్యాచ్ పొడవునా బ్రెజిల్ జట్టు బంతిని ఎక్కువ సమయం పాటు తమ ఆధీనంలో ఉంచుకోగలిగింది. నార్వే డిఫెన్స్ తీవ్ర ఒత్తిడి తెచ్చింది. గోల్ పోస్ట్ పై పదే పదే దాడులు సాగించింది. ఇక్కడ గోల్‌కీపర్ ఓర్జన్ నైలాండ్ అడ్డుగోడగా నిలచాడు. అసాధారణ ప్రతిభ కనబరిచాడు. బ్రెజిల్ ఆటగాళ్లు చేసిన దాడులను పదే పదే అడ్డుకున్నాడు. మ్యాచ్ మొత్తానికీ హీరోగా నిలిచాడు. నార్వేకు కొండంత అండ అయ్యాడు.

Neymar Penalty Too Late as Haaland Stars Norway Seal Historic 2-1 Win Over 5-Time Champions Brazil

ముఖ్యంగా మ్యాచ్ ఆరంభంలో బ్రెజిల్ స్టార్ బ్రూనో గుమారేస్ కొట్టిన కీలకమైన పెనాల్టీ కిక్‌ను నైలాండ్ ఆపిన తీరు అద్భుతం. బ్రెజిల్ వింగర్స్ వినీషియస్ జూనియర్, గాబ్రియేల్ మార్టినెల్లి చేసిన శక్తిమంతమైన దాడులను కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాడు. దీంతో మ్యాచ్ ప్రథమార్థం ఏ జట్టూ గోల్ సాధించలేకపోయింది. నార్వేకు కూడా కొన్ని అవకాశాలు లభించినప్పటికీ దాన్ని గోల్స్ గా మలచుకోలేకపోయింది. స్కోరు బోర్డు కదల్లేదు.

రెండు జట్లు ఎలాంటి గోల్స్ చేయకుండానే విరామ సమయానికి వెళ్లాయి. ద్వితీయార్ధంలో బ్రెజిల్ కోచ్ కార్లో అన్సెలోట్టి వ్యూహాత్మక మార్పులు చేశాడు. యువ సంచలనం ఎండ్రిక్‌ను మైదానంలోకి దింపాడు. అయినప్పటికీ నార్వే డిఫెన్స్ ను చేధించడంలో బ్రెజిల్ విఫలమైంది. మ్యాచ్ చివరి దశకు చేరుకున్న తరుణంలో నార్వే హఠాత్తుగా ఎదురుదాడికి దిగింది. 79వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు ఆండ్రియాస్ స్కెల్డ్రప్ అందించిన అద్భుతమైన క్రాస్‌ను ఎర్లింగ్ హాలాండ్ హెడర్ ద్వారా బ్రెజిల్ గోల్‌పోస్ట్‌లోకి నెట్టి నార్వేకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.

ఈ గోల్‌తో నార్వే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బ్రెజిల్ ఆటగాళ్లు డిఫెన్స్‌లో చేసిన చిన్న తప్పులను హాలాండ్ సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు. మొదటి గోల్ సాధించిన ఉత్సాహంలో ఉన్న నార్వేపై బ్రెజిల్ ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించింది గానీ హాలాండ్ మరోసారి తన క్లాస్ చూపించాడు. బ్రెజిల్ డిఫెండర్లను ఏమారుస్తూ లెఫ్ట్ ఫుట్‌తో క్లాసిక్ గోల్ కొట్టాడు.

ఈ డబుల్స్ తో హాలాండ్ ప్రస్తుత టోర్నీలో మొత్తం ఏడు గోల్స్‌తో కొట్టిన మూడో ఆటగాడయ్యాడు. లియోనెల్ మెస్సి, కిలియన్ ఎంబప్పేల సరసన నిలిచాడు. గోల్డెన్ బూట్ రేసులో దూసుకొచ్చాడు. ఇంజూరీ టైమ్ చివరి నిమిషంలో బ్రెజిల్ ఆటగాడు కాసెమిరోను నార్వే డిఫెండర్ నెట్టేయడంతో బ్రెజిల్‌కు పెనాల్టీ లభించింది. స్టార్ ఫార్వర్డ్ నెయ్‌మార్ దీనిని సులువుగా గోల్‌గా మలిచినప్పటికీ, అప్పటికే మ్యాచ్ సమయం ముగిసిపోవడంతో బ్రెజిల్‌కు ఓటమి తప్పలేదు.

బ్రెజిల్‌పై నార్వే సాధించిన ఈ చారిత్రక విజయం, ఆ జట్టుపై నార్వేకు గల వరుసగా ఐదో అపజయాల రహిత రికార్డును మరింత సుస్థిరం చేసింది. ఈ పరాజయంతో బ్రెజిల్ జట్టు వరల్డ్ కప్ నాకౌట్ దశలలో యూరోపియన్ ప్రత్యర్థుల చేతిలో వరుసగా ఏడోసారి ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ అద్భుత విజయం నార్వే ఫుట్‌బాల్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఇక క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లాండ్ లేదా మెక్సికో జట్టుతో తలపడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+