నో రోహిత్ శర్మ: ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్లు వీళ్లే..
Rohit Sharma: మొన్నటివరకు వన్డేలు, టీ20 ఇంటర్నేషనల్స్ ఆడిన భారత క్రికెట్ జట్టు.. ఇక టెస్ట్ సిరీస్‌లకు సన్నద్ధమౌతోంది. వచ్చే ఏడాది జనవరి వరకు విరామం లేకుండా సాగనున్న సిరీస్‌లు ఇవి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భాగంగా వాటిల్లో ఆడబోతోంది.
ఇందులో భాగంగా- తొలుత స్వదేశంలో బంగ్లాదేశ్‌ను ఎదుర్కొనబోతోంది. రెండు టెస్టులు, మూడు టీ20 ఇంటర్నేషనల్స్‌తో కూడిన సిరీస్‌లు ఇవి. ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ ఈ నెల 19వ తేదీన ఆరంభం కానుంది. ఆ తరువాత ఆస్ట్రేలియాలో ఆ దేశ జట్టుతో అయిదు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్‌కు చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. చివరిదైన రెండో మ్యాచ్ అక్టోబర్ 1వ తేదీన కాన్పూర్‌లో షెడ్యూల్ అయింది. ఆ తరువాత మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి. ప్రస్తుతం టెస్టుల్లో తన కంటే ఎంతో బలమైన పాకిస్తాన్‌ను ఓడించిన ఊపులో ఉంది బంగ్లాదేశ్.
ఈ ఏడాది మార్చి తరువాత ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడింది లేదు టీమిండియా. మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన అయిదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ చివరిది. ఇందులో ఎలా రాణిస్తుందనే విషయంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై హాట్ హాట్‌గా డిబేట్ సాగుతోంది.
ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ఎస్ఏబీసీ.. ఓ నివేదికను విడుదల చేసింది. 21వ శతాబ్దంలో 10 మంది అత్యుత్తమ సమకాలీన, మాజీ క్రికెటర్ల పేర్లతో రూపొందించిన జాబితా ఇది. ఈ 10 మంది ది బెస్ట్ క్రికెటర్లను ఎంపిక చేయడానికి ప్రత్యేకంగా ఆడియన్సులు, ఎక్స్‌పర్ట్స్‌తో ఓటింగ్ నిర్వహించడం విశేషం.
ఈ జాబితాలో టీమిండియా బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. రెండోస్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన మిస్టర్ 360 డిగ్రీస్ ఏబీ డివిలియర్స్, మూడో స్థానంలో ఇంగ్లాండ్ మాజీ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్, ఫోర్త్ పొజీషన్‌లో శ్రీలంక మాజీ కేప్టెన్ కుమార సంగక్కార ఉన్నారు.
ఆ తరువాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్, ఆస్ట్రేలియన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ నిలిచారు. ఎనిమిదో స్థానంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆ తరువాత హషీమ్ ఆమ్లా ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీది చిట్టచివరి స్థానం. రోహిత్ శర్మకు ఇందులో చోటు దక్కలేదు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications