ఈ గెలుపు చాలదు బాస్: ఇంకా మైనస్ లోనే భారత్ నెట్ రన్ రేట్..

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో ఎట్టకేలకు తిరుగులేని విజయాన్ని అందుకుంది భారత్. అచ్చొచ్చిన చెన్నై చెపాక్ చిదంబరం స్టేడియంలో జింబాబ్వేపై రెచ్చిపోయింది. ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ లో సత్తా చాటింది. ఆ తర్వాత బౌలింగ్ లో ఫర్వాలేదనిపించుకుంది. 72 పరుగుల భారీ తేడాతో జెండా ఎగురవేసింది. ఈ గెలుపుతో సెమీ ఫైనల్స్ రేసులో దూసుకొచ్చింది టీమిండియా. ఇక తన తదుపరి మ్యాచ్ లో వెస్టిండీస్ ను ఢీ కొట్టబోతోంది. మార్చి 1న కోల్ కత ఈడెన్ గార్డెన్స్ జరుగనుందీ గేమ్.

సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల ఓటమి తర్వాత సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీన్ని అధిగమించింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 30 బంతుల్లో 55, హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో అజేయంగా 50 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించారు. భారత్ 20 ఓవర్లలో 256/4 భారీ స్కోరు సాధించింది. ఇది టీ20 ప్రపంచ కప్ చరిత్రలో.. ప్రస్తుత టోర్నమెంట్‌లో అత్యధిక జట్టు స్కోరు.

NRR Still in the Minus for India after Wins Zimbabwe The West Indies Match Will Decide Fate on March 1

జింబాబ్వే వీరోచితంగా పోరాడినప్పటికీ, లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జింబాబ్వే ఇన్నింగ్ లో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ హీరో. బలమైన టీమిండియా బౌలింగ్ ను తుత్తునీయలు చేశాడు. 59 బంతుల్లో 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్ లో ఆరు సిక్సులు, ఎనిమిది ఫోర్లు ఉన్నాయంటే ఎంత దూకుడుగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్స్ భవితవ్యం ఇప్పుడు వారి చేతుల్లోనే ఉంది.

ఈ మ్యాచ్ తర్వాత కూడా టీమిండియా నెట్ రన్ రేట్ మైనస్ లోనే ఉండటం గమనార్హం. ఇది చాలదు. తన తదుపరి మ్యాచ్ లో వెస్టిండీస్ పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఆ జట్టు ప్రస్తుతం దూకుడుగా ఆడుతోంది. జింబాబ్వే కన్నా బలమైన జట్టు. ఇందులో గెలిచిన జట్టు సెమీ ఫైనల్స్ కు చేరుకుంటుంది. ఒకవేళ వెస్టిండీస్ గెలిస్తే లేదా మ్యాచ్ రద్దయినా/ఫలితం రాకపోయినా, మెరుగైన నెట్ రన్ రేట్ (NRR) కారణంగా వెస్టిండీస్ సెమీస్ కు వెళ్తుంది.

ప్రస్తుతం ఉన్న పాయింట్లు ఇలా..

1. దక్షిణాఫ్రికా - 4 పాయింట్లు, 2 మ్యాచ్‌లు, నెట్ రన్ రేట్ +2.890

2. వెస్టిండీస్ - 2 పాయింట్లు, 2 మ్యాచ్‌లు, నెట్ రన్ రేట్ +1.791

3. భారత్ - 2 పాయింట్లు, 2 మ్యాచ్‌లు, నెట్ రన్ రేట్ -0.100

4. జింబాబ్వే - 0 పాయింట్లు, 2 మ్యాచ్‌లు, నెట్ రన్ రేట్ -4.475

మిగిలిన కీలక మ్యాచ్‌లు..

మార్చి 1: దక్షిణాఫ్రికా వర్సెస్ జింబాబ్వే (మధ్యాహ్నం 3 గంటలకు)

మార్చి 1: భారత్ వర్సెస్ వెస్టిండీస్ (సాయంత్రం 7 గంటలకు)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+