Saurabh Netravalkar: పాక్‌ను కుప్పకూల్చిన ఒరాకిల్ టెక్కీ
USA vs PAK: టీ20 వరల్డ్ కప్ 2024లో పెను సంచలనం. పసికూన చేతిలో పాకిస్తాన్ మట్టికరిచింంది. పసికూన యూఎస్ఏ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ప్రతిష్ఠాత్మక వరల్డ్ కప్‌ను అత్యంత అవమానకరంగా ఆరంభించింది. సౌరభ్ నేత్రవల్కర్.. ఈ మ్యాచ్ అసలు సిసలు హీరో. సూపర్ ఓవర్‌లో బాబర్ ఆజమ్ సేనను కట్టడి చేయగలిగాడు.
డల్లాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ కమ్ కేప్టెన్ బాబర్ ఆజమ్- 44, మిడిలార్డర్‌లో షాదబ్ ఖాన్- 40, చివర్లో షహీన్ షా అఫ్రిది- 23, ఇఫ్తికర్ అహ్మద్- 18 పరుగులు చేయగలిగారు.

అనంతరం ఛేజింగ్‌లో యూఎస్ఏ బ్యాటర్లు సత్తా చాటారు. ఓపెనర్ కేప్టెన్ మోనాంక్ పటేల్ హాఫ్ సెంచరీ చేశాడు. 38 బంతుల్లో ఒక సిక్స్, ఏడు ఫోర్లతో సరిగ్గా 50 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆండ్రీస్ గౌస్- 35, ఆరోన్ జోన్స్- 36 పరుగులు చేయడం 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి సరిగ్గా 159 పరుగులు చేసింది యూఎస్.
టై కావడంతో మ్యాచ్.. సూపర్ ఓవర్‌కు వెళ్లింది. ఇందులో తొలుత పాక్ బౌలింగ్‌కు దిగింది. పాక్ ఏస్ బౌలర్ మహ్మద్ అమీర్ బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతిని ఆరోన్ జోన్స్ బౌండరీ తరలించాడు. దీనితో అమీర్‌పై ఒత్తిడి పెరిగింది. పూర్తిగా తడబడ్డాడు. సూపర్ ఓవర్‌లో ఏకంగా మూడు వైడ్లను వేయడం దీనికి నిదర్శనం.
4వ బంతి వైడ్ ప్లస్ 2 పరుగులు, అయిదో బంతి వైడ్ ప్లస్ 2, 6వ బంతి వైడ్ ప్లస్ 3 పరుగులొచ్చాయి. సూపర్ ఓవర్‌లో యూఎస్ బ్యాటర్లు పెద్దగా కష్టపడకపోయినా 18 పరుగులొచ్చాయంటే.. అతని బౌలింగ్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫీల్డర్లు సైతం విఫలం అయ్యారీ ఓవర్‌లో.
మ్యాచ్ గెలవాలంటే 6 బంతుల్లో 18 పరుగుల చేయాల్సిన దశలో ఇఫ్తికర్ అహ్మద్, ఫకర్ జమాన్ బ్యాటింగ్‌కు దిగారు. అక్కడా చేతులెత్తేశారు. వికెట్ సైతం కోల్పోయింది. సూపర్ ఓవర్ మూడో బంతికి ఇఫ్తికర్ అహ్మద్ క్యాచ్ అవుట్ అయ్యాడు. అతని తరువాత వచ్చిన షాదబ్ ఖాన్ ఆ వేగాన్ని కొనసాగించలేకపోయాడు. మొత్తంగా ఆ ఓవర్‌లో పాకిస్తాన్‌కు లభించింది 13 పరుగులే.
సౌరభ్ నేత్రవల్కర్.. ముంబైకి చెందిన క్రికెటర్. కుడి చేత్తో బ్యాటింగ్ చేసే లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలర్. 2010 ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ టోర్నమెంట్‌లో మొదటిసారిగా బాబర్ ఆజమ్ వికెట్ పడగొట్టాడు. ఆరు మ్యాచ్‌లను ఆడిన సౌరభ్.. తొమ్మిది వికెట్లతో టీమిండియా తరఫున హయ్యెస్ట్ వికెట్ టేకర్.
2013లో ముంబై యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికా వెళ్లాడు. 2016లో కార్నెల్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డ్రిగీ అందుకున్నాడు. అనంతరం ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాయిన్ అయ్యాడు.
అక్కడ ఉండగానే- గల్ఫ్ జెయింట్స్, గయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆడేవాడు. అనంతరం యూఎస్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. మెయిన్ బౌలర్ అతనే. టీ20 వరల్డ్ కప్‌లో యూఎస్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను లీడ్ చేస్తోన్నాడీ ముంబైకర్. కొమ్ములు తిరిగిన పాకిస్తాన్‌ను సూపర్ ఓవర్‌లో కట్టడి చేయగలిగాడు. మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 18 పరుగులు ఇచ్చి, రెండు వికెట్లు పడగొట్టాడు.
-
2,700 డిగ్రీల సెల్సియస్ వేడి మధ్య.. అమెరికా తీరంలో స్ప్లాష్ డౌన్ -
అమెరికా అధ్యక్షుడిగా ఇంతకంటే గర్వపడలేను -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం- ఇకపై మరింత..!! -
రెడ్ జోన్.. పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్‌తో గ్లోబల్ స్టార్‌గా..! -
ఆ ఇద్దరి రాకతో జాగ్రత్త పడ్డ ఇరాన్- అనుకున్నదంతా అయింది -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications