బౌలింగ్ అంటే ఇదీ: రెండు మ్యాచ్‌లల్లో రెండు హ్యాట్రిక్స్

Pat Cummins: టీ20 వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ చరిత్రను తిరగరాశాడు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో మరో హ్యాట్రిక్ అందుకున్నాడు. సూపర్ 8లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను ఈ ఘనతను సాధించాడు. వరుసగా రెండు మ్యాచ్‌లల్లో రెండు హ్యాట్రిక్స్‌ను నమోదు చేశాడు.

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా వెస్టిండీస్‌లోని సెయింట్ విన్సెంట్‌లోని కింగ్స్‌టౌన్ స్టేడియంలో ఆస్ట్రేలియా.. ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతోంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్..ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనలేక చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.

Pat Cummins scripts history with two hat-tricks in a row in T20 World Cup 2024

ఓపెనర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. దాన్ని నిలబెట్టుకోలేకపోయింది ఆఫ్ఘనిస్తాన్. భారీ స్కోర్‌గా మలచుకోవడంలో విఫలమైంది. ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రహ్మనుల్లా గుర్బాజ్- 60, ఇబ్రహీం జడ్రాన్- 51 పరుగులు చేశారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 118 పరుగులు జోడించారు.

వారిద్దరూ అవుట్ అయిన తరువాత వచ్చిన బౌలర్లు ఎవరూ క్రీజ్‌లో నిలదొక్కుకోలేదు. అజ్మదుల్లా ఓమర్జాయ్- 2, కరీం జనత్- 13, కేప్టన్ రషీద్ ఖాన్- 2, గుల్బదీన్ నబీ- 0, మహ్మద్ నబీ- 2, (నాటౌట్), నంగేయాలియా ఖరొటే- 1 (నాటౌట్) పరుగులు చేయగలిగారంతే.

బౌలర్లల్లో పాట్ కమ్మిన్స్- 3, ఆడమ్ జంపా- 2, మార్కస్ స్టొయినిస్- 1 వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా పాట్ కమ్మిన్స్ దుమ్ము లేపాడు. హ్యాట్రిక్‌తో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు చూపాడు. 18వ ఓవర్ ఆరో బంతి, 20వ ఓవర్ తొలి రెండు బంతులకు వరుస వికెట్లు నేలకూల్చాడు. ఈ టీ20 వరల్డ్ కప్‌లో రెండు హ్యాట్రిక్ అందుకున్న తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

18వ ఓవర్ చివరి బంతికి రషీద్ ఖాన్‌ను పెవిలియన్ దారి పట్టించాడు కమ్మిన్స్. ఆఫ్ స్టంప్‌కు కాస్త దూరంగా వెసిన షార్ట్ గుడ్ లెంగ్త్ బంతిని లాంగ్ ఆన్ దిశగా హెలికాప్టర్ షాట్ ఆడాడు రషీద్. బ్యాట్ అంచులను తాకి గాల్లోకి లేచిన బంతిని లాంగ్ ఆన్‌లో ఉన్న టిమ్ డేవిడ్ అందుకున్నాడు. దీనితో 126 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఆఫ్ఘన్.

20వ ఓవర్ తొలి బంతికి కరీం జనత్‌ను బలి తీసుకున్నాడు. ఆఫ్ స్టంప్‌కు అవతల వెసిన లెంగ్తీ డెలివరీని వైడ్ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి గాల్లోకి ఎగిరింది. వెనక్కి పరుగెత్తుతూ మరీ టిమ్ డేవిడ్ ఈ బంతిని అద్భుతంగా క్యాచ్ పట్టాడు. కరీం రూపంలో 141 పరుగుల వద్ద అయిదో వికెట్ పడింది.

20వ ఓవర్ రెండో బంతికి గుల్బదిన్ నబీ వికెట్ కూల్చాడు కమ్మిన్స్. అతను సంధించిన లెంగ్తీ డెలివరీని భారీ షాట్ ఆడాడు నబీ. టైమింగ్ మిస్ అయ్యాడు. లెగ్ సైడ్ దిశగా గాల్లోకి లేచిన ఆ బంతిని గ్లెన్ మ్యాక్స్‌వెల్ అందుకున్నాడు. దీనితో 141 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది ఆఫ్ఘనిస్తాన్.

దీనికి ముందు మ్యాచ్‌లో కూడా పాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌పై అతనీ ఘనతను సాధించాడు. రెండు మ్యాచ్‌లల్లో రెండు హ్యాట్రిక్స్‌ను అందుకున్న మొట్టమొదటి బౌలర్‌గా నిలిచాడు. మొత్తంగా టీ20 వరల్డ్ కప్‌లల్లో ఇది ఎనిమిదో హ్యాట్రిక్. టీ20 వరల్డ్ కప్‌లల్లో ఆస్ట్రేలియా తరఫున హ్యాట్రిక్ అందుకున్న మొదటి బౌలర్.. బ్రెట్ లీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+