ఆర్సీబీకి బిగ్ షాక్- ఫైనల్స్ కు స్టార్ ప్లేయర్ అవుట్: అంతా సవ్యంగా సాగుతుందనుకంటోన్న దశలో

IPL 2025 final: ఐపీఎల్ 2025లో బిగ్ డే.. నేడే ఫైనల్స్. ఐపీఎల్ లో ఓ కొత్త ఛాంపియన్ ఆవిర్భవించబోయేదీ నేడే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీ కొట్టబోతోంది పంజాబ్ కింగ్స్. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక.

ఏ జట్టు గెలిచినా.. తొలిసారి కప్ ను ముద్దాడుతుంది. ఈ రెండింట్లో ఏ జట్టు కూడా ఇప్పటివరకు ఐపీఎల్ కప్ కొట్టలేదు. 2022 తరువాత మళ్లీ అలాంటి సీన్.. ఈ రాత్రికి రిపీట్ కాబోతోంది. ఆ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త విజేతను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేయబోతోంది 18వ ఐపీఎల్ సీజన్.

Phil Salt likely to miss IPL 2025 Final

ఇప్పటివరకు అత్యధికసార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. అయిదేసిసార్లు చొప్పున కప్ గెలిచాయి. ఈ రెండింటికే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ అనే పేరు ఉంది. ఈ సారి ఈ రెండూ కూడా ఫైనల్స్ చేరలేకపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్.. లీగ్స్ దశలోనే ఇంటిముఖం పట్టగా.. ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ లో ఓడిపోయింది.

ఈ రెండింటి తరువాత కోల్ కత నైట్ రైడర్స్ మూడుసార్లు విజేతగా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, దక్కన్ ఛార్జర్స్ ఒక్కోసారి కప్ అందుకున్నాయి. నేడు- రాయల్ ఛాలెంజర్స్ లేదా పంజాబ్ కింగ్స్.. ఈ జాబితాలో చేరనున్నాయి.

అంతా సవ్యంగా సాగుతుందనుకుంటోన్న ఈ దశలో ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు డాషింగ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఫైనల్స్ కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ఉదయం నరేంద్ర మోదీ స్టేడియంలో నెట్ సెషన్స్ కు అతను అటెండ్ కాకపోవడం.. ఈ అనుమానాలను మరింత బలపరుస్తోన్నాయి.

దీనికి కారణం లేకపోలేదు. ఫిల్ సాల్ట్ భార్య నిండు గర్భిణి. నేడో, రేపో ఆమె డెలివరీ కానున్నారు. తొలి చూలు బిడ్డకు స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో భార్య పక్కన ఉండాలని ఫిల్ సాల్ట్ కోరుకుంటోన్నాడని, ఈ కారణంతో స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఫిల్ సాల్ట్ అందుబాటులో ఉన్నాడా? లేదా అనే విషయంపై ఆర్సీబీ మేనేజ్ మెంట్ ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, కేప్టెన్ రజత్ పటిదార్ కూడా సాల్ట్ గైర్హాజర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు. ఈ వార్తలను తోసిపుచ్చనూ లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+