ప్రసిద్ధ్ కృష్ణ రేర్ ఫీట్ - మొదటి బౌలర్ గా రికార్డు..!!
సిడ్నీ టెస్టు లో ఓటమితో టీమిండియా ఆసీస్ టూర్ ముగించింది. చివరి టెస్టులో ఎన్నో అంచనా ల నడుమ మూడో రోజునే ఫలితం వచ్చింది. టీమిండియాలో ప్రధాన బ్యాటర్ల వైఫల్యం ఈ మ్యాచ్ లో ఓటమికి అసలు కారణంగా నిలిచింది. రోహిత్ స్థానంలో బూమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా.. వెన్ను సమస్యతో రెండో ఇన్నింగ్స్ బౌలింగ్ కు బూమ్రా దూరంగా ఉన్నాడు. కోహ్లీ కెప్టెన్సీ చేసినా.. సులువుగా ఆసీస్ బ్యాటర్లు విజయం లక్ష్యం చేధించారు. కాగా, ఈ టెస్టులో ప్రసిద్ధ్ కృష్ణ అరుదైన ఫీట్ సాధించి.. తొలి బౌలర్ గా నిలిచారు.
అరుదైన ఫీట్
సిడ్నీ టెస్టులో ఓటమితో టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ పోరాటం నుంచి వైదొలిగింది. టెస్టు ర్యాంకింగ్స్ లోనూ దిగజారింది. ప్రధాన బ్యాటర్లు ఎక్కడా కనీస సామర్ధ్యం నిరూపించుకోలేక పోయారు. టెయిల్ ఎండర్లు చేసిన పోరాటం కూడా చేయలేక చేతులెత్తేసారు. ఇక, సిరీస్ ను ఆసీస్ కైవసం చేసుకుంది. కాగా, ఈ అయిదో టెస్టుతో టీం ఇండియా యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. టెస్టు కేరీర్ లో 9999 పరుగుల వద్ద ఒక బ్యాటర్ ను అవుట్ చేసిన తొలి బౌలర్ గా నిలిచాడు. గతంలో సౌతాఫ్రికా బౌలర్ జాక్వస్ కల్లీస్ చేతిలో ఇదే విధంగా శ్రీలంక
బ్యాటర్ మహేల జయవర్ధనే ను అవుట్ చేసాడు.

ప్రసిద్ధ్ కృష్ణ రికార్డు
అదే విధంగా 9,990 నుంచి పది వేల పరుగులు చేసే వేళ విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా రెండు సార్లు అవుట్ అయ్యాడు. ఇప్పుడు సిడ్నీ టెస్టులో ఆసీస్ బ్యాటర్ స్మిత్ 10 వేల పరుగులు చేయటా నికి కేవలం ఒక్క పరుగు అవసరం అయిన వేళ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక, ఇప్పుడు స్మిత్ పది వేల పరుగులు పూర్తి చేయటానికి శ్రీలంక పర్యటన వరకు వేచి చూడాల్సిందే. ఆసీస్ నుంచి రికీ పాంటింగ్, అలన్ బోర్డర్, స్టీవ్ వా తర్వాత 10వేల టెస్టు పరుగులు చేసిన నాలుగో ఆసీస్ బ్యాటర్ గా నిలుస్తాడు. స్మిత్ ను అరెస్ట్ చేయటంతో ప్రసిద్ధ్ కృష్ణ పేరిట కొత్త రికార్డు నమోదైంది.












Click it and Unblock the Notifications