ఆ స్టార్ ప్లేయర్ కు కన్నుగీటిన ప్రీతి- బ్యాటింగ్ అంత నచ్చిందేమో

IPL 2025 Qualifier 2: ఐపీఎల్ 2025.. ఫైనల్స్ ఎవరో తేలిపోయింది. క్వాలిఫయర్ 1 సీన్.. ఇక్కడ కాబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ ఢీ కొట్టబోతోంది. మంగళవారమే ఫైనల్ గేమ్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ విజయఢంకా మోగించింది. అయిదు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ను మట్టికరిపించింది. ఊహించినట్టే- ముంబై ఇండియన్స్ బౌలర్లు ఈ మ్యాచ్ లో ఘోరంగా విఫలం అయ్యారు. 203 పరుగుల భారీ స్కోర్ ను కాపాడుకోలేకపోయారు.

Preity Zinta s wink gesture to Punjab Kings player Nehal Wadhera after Qualifier 2

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లల్లో 203 పరుగులు చేయగా.. దాన్ని కొట్టిఅవతల పడేసింది పంజాబ్. ఇంకా ఓ ఓవర్ మిగిలివుండగానే 207 పరుగులు కొట్టింది. ఈ క్రమంలో అయిదు వికెట్లను కోల్పోయింది. 72 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ- ఏ మాత్రం వెనుకంజ వేయలేదా జట్టు.

టాప్ ఆర్డర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ బ్యాటింగ్.. జట్టుకు ముమెంటమ్ ను అందించింది. ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు ఇంగ్లిస్. దుమ్ము దులిపాడు. ఇంగ్లిస్ దెబ్బకు బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటాలో 40 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. బౌలర్లు సమష్టిగా విఫలం కావడం ముంబై విజయావకాశాలను దెబ్బకొట్టింది.

పంజాబ్ కింగ్స్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాడు. 41 బంతుల్లో ఎనిమిది భారీ సిక్సర్లు, అయిదు ఫోర్లతో 87 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లీస్.. 21 బంతుల్లో రెండు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 38, నెహాల్ వధేరా.. 29 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 48 పరుగులు జట్టును విజయతీరాలకు చేర్చాయి.

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్ లో తిలక్ వర్మ- 44, సూర్యకుమార్ యాదవ్- 44, జానీ బెయిర్ స్టో- 38, నమన్ ధీర్- 37 పరుగులతో రాణించారు. ఫైనల్స్ రెడ్ కార్పెట్ పరిచే ఈ గేమ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ విఫలం అయ్యాడు. ఎలిమినేటర్ తరహాలో మరోసారి విజృంభిస్తాడని ఆశించిన అభిమానుల అంచనాలను బోల్తా కొట్టించాడు. ఎనిమిది పరుగులకే పెవిలియన్ చేరాడు.

ఐపీఎల్ 2025 ఫైనల్స్ చేరడంతో.. పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఓనర్ ప్రీతి జింతా సంతోషానికి హద్దు లేకుండా పోయింది. జోష్ లో కనిపించిందామె. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా ప్లేయర్లతో తన ఆనందాన్ని పంచుకుంది. ప్రత్యేకించి- నేహాల్ వధేరాను కన్ను కొట్టడం హైలైట్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+