World Cup 2023: దిష్టి తీసిన నానమ్మ, జై శ్రీరాం అంటూ రచిన్ - వీడియో వైరల్..!!

ప్రపంచ కప్ సమరంలో రచిన్ రవీంద్ర. ఈ పేరు ఒక సంచలనం. ఇండియ‌న్ మూలాలు ఉన్న ఆ క్రికెట‌ర్ ప్ర‌స్తుతం కివీస్‌కు ఆడుతున్నాడు. అయితే తాజాగా జ‌రుగుతున్న వ‌రల్డ్‌క‌ప్‌లో అత‌ను త‌న బ్యాటింగ్ శైలితో ఆక‌ట్టుకుంటున్నాడు. ర‌చిన్ ర‌వీంద్ర పేరెంట్స్‌ది బెంగుళూరు. అత‌ని పేరెంట్స్ న్యూజిలాండ్‌లో స్థిర‌ప‌డ్డారు. శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్ కోసం బెంగుళూరు వ‌చ్చిన ర‌చిన్ ర‌వీంద్ర .. త‌న పేరెంట్స్ ఇంటికి వెళ్లారు. అక్కడ నానమ్మ రచిన్ కు దిష్టి తీసారు.

రచిన్ కు దిష్టి తీసి : బెంగళూరులో శ్రీలంక పైన విజయం తో న్యూజీలాండ్ సెమీస్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంది. ఈ నెల 15న భారత్ తో తొలి సెమీస్ ఆడనుందనే అంచనాలు ఉన్నాయి. కివీస్ ఈ ప్రపంచ కప్ లో ప్రతీ విజయంలో నూ రచిన్ రవీంత్ర పాత్ర ఉంది. బెంగళూరు మ్యాచ్ లో రచిన్ ఇప్పటి వరకు ఉన్న సచిన్ రికార్డును అధిగమించాడు. 25 ఏళ్ల లోపు ప్రపంచ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డును తిరగరాసి కొత్త రికార్డును నెలకొల్పాడు. బెంగళూరు వేదికగా రచిన్ కోసం ప్రేక్షుల నుంచి భారీ మద్దతు కనిపించింది. రచిన్ పేరుతో స్టేడియం మార్మోగింది. భారత్ పైన అభిమానం చేపించే రచిన ఇక, సెమీస్ మ్యాచ్ లో ఎలా ఆడుతారనేది ప్యాన్స్ లో ఉత్కంఠకు కారణమవుతోంది.

Rachin Ravindra seeks the blessings of his grandmother ahead Semis against India at Banglore

ప్రపంచ కప్ సంచలనం : స్టేడియంలో అభిమానుల నుంచి వచ్చిన మద్దతు పైన రచిన్ ఎగ్జైట్ అయ్యాడు. బెంగుళూరులో ఆడ‌డం ప్ర‌త్యేక‌మైంద‌ని, ప్రేక్ష‌కులు త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌న్నాడు. ఆరు నెల‌ల క్రితం త‌న పేరు జ‌ట్టులో లేద‌ని, కానీ ఇప్పుడు జ‌ట్టులో కీల‌క స‌భ్యుడిని కావ‌డం సంతోషంగా ఉంద‌న్నాడు. టీనేజీలో క్ల‌బ్ క్రికెట్ ఆడేందుకు ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ట్లు చెప్పాడు. బెంగళూరు లో ఇంటికి వెళ్లిన రచిన్ రవీంద్రకు నాన‌మ్మ క్రికెట‌ర్‌కు దిష్టితీసింది. ఇంటికి వెళ్లిన అత‌న్ని ఓ సోఫాలో కూర్చోపెట్టి.. ఆ బామ్మ దిష్టి తీసింది. క్రికెట‌ర్ ర‌వీంద్ర‌కు దిష్టితీసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ర‌చిన్ తండ్రి ర‌వి కృష్ణ‌మూర్తి, త‌ల్లి దీపి.. బెంగుళూరుకు చెందిన‌వారే. ఆ ఇద్ద‌రూ 1997 వ‌ర‌కు ఇక్క‌డే ఉన్నారు. కృష్ణ‌మూర్తి ఇక్క‌డ‌ క్ల‌బ్ క్రికెట్ ఆడేవారు. ఆ త‌ర్వాత అత‌ను వెల్లింగ్ట‌న్‌లో టెకీగా స్థిర‌ప‌డ్డారు.

రచిన్ పోస్టు వైరల్ : ర‌చిన్ పుట్టింది అక్క‌డే అయినా చిన్న‌త‌నం నుంచి ర‌చిన్ త‌రుచూ ఇండియా వస్తూ వెళ్లాడు. న్యూజిలాండ్ కూడా ర‌చిన్ తండ్రి క్ల‌బ్ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇచ్చాడు. హ‌ట్ హాక్స్ క్ల‌బ్‌ను ఏర్పాటు చేశాడు. ర‌చిన్‌ తన తండ్రి నుంచే క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ర‌చిన్ ఇప్ప‌టి వ‌ర‌కు 565 ర‌న్స్ స్కోర్ చేశాడు. ర‌చిన్ త‌న ఎక్స్ అకౌంట్‌లో బామ్మ దిష్టితీస్తున్న వీడియోను పోస్టు చేశాడు. ఆ వీడియోకు జై శ్రీరాం అని రాశాడు. అంద‌మైన కుటుంబాన్ని పొంద‌డం దీవ‌న‌గా భావిస్తున్న‌ట్లు చెప్పాడు. గ్రాండ్‌పేరెంట్స్ దీవెన‌లు ఎప్ప‌టికీ త‌న‌తో ఉంటాయ‌ని పేర్కొన్నారు. తన పోస్టులో జై శ్రీరాం అని రాయటం..ఈ పోస్టు వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+