ఆఫ్ఘన్ క్రికెటర్ పెద్ద మనసు - పేదల కోసం అర్ద్రరాత్రి దీపావళి సాయం..!!

రెహ్మానుల్లా గుర్భాజ్. ప్రస్తుత ప్రపంచ కప్ లో అందరి ప్రశంసలు అందుకున్న ఆఫ్ఘన్ క్రికెటర్. అంచనాకు మించి ఈ సారి ప్రపంచ కప్ లో ఆఫ్గన్ టీం రాణించింది. ఒక దశలో సెమీస్ రేసులోనూ నిలిచింది. ఆసీస్ బ్యాటర్ మాక్స్ వెల్ వీర విహారంతో అవకాశం మిస్ చేసుకుంది. అయితే, ఈ టీం మేటి ప్లేయర్ రెహ్మానుల్లా గుర్భాజ్ ఇప్పుడు భారతీయలు మనసు గెలుచుకున్నాడు. దీపావళి వేళ అహ్మదాబాద్ లో అర్ద్రరాత్రి సమయంలో పేదలకు దీపావళి మందు నిశ్చబ్ద సాయం అందించాడు.

ప్రపంచ కప్ లో ఆఫ్గన్ టీం సంచలనాలు నమోదు చేసింది. తాము ఆడేందుకే కాదు..గెలవటానికి వచ్చామని నిరూపించింది. అగ్రశ్రేణి జట్లకు షాక్ ఇచ్చింది. ఎలాంటి అంచనాలూ లేకుండా బరిలోకి దిగిన అఫ్గాన్ టీమ్.. తమ అద్భుత ఆటతీరుతో మేటి జట్లను సైతం భయపెట్టింది.

Rahmanullah Gurbaz silently gave money to the needy people on the streets of Ahmedabad

సెమీస్‌కు చేరలేకపోయినా క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ టీంలో బ్యాటర్ రెహ్మానుల్లా గుర్భాజ్ క్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మైదానంలో బ్యాట్‌తో అలరించిన గుర్భాజ్ మైదానం వెలుపల తన మంచి మనసుతో ఆకట్టుకున్నాడు. అహ్మదాబాద్ వీధుల్లోని ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న పేదలకు గుర్బాజ్ నిశ్శబ్దంగా సహాయం అందించాడు.

రాత్రిపూట వీధిలో నిద్రిస్తున్న వారి ఒక్కొక్కరికీ రూ. 500 నోట్లు ఇస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కారులో వచ్చిన గుర్బాజ్ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న పేదలకు డబ్బులు అందించాడు. తను చేసిన సహాయం గురించి ఎలాంటి ప్రచారమూ చేసుకోలేదు. అయితే అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీని పైన నెటిజెన్లు స్పందిస్తున్నారు. గుర్బాజ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. తను అఫ్గానిస్తాన్ వెళ్లే ముందు గుర్బాజ్ ఇచ్చిన దీపావళి గిఫ్ట్, చాలా గొప్ప మనసు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+