చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్- ఒకే ఒక్కడు: దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు
ఆఫ్ఘానిస్తాన్ కేప్టెన్, టాప్ క్లాస్ స్పీన్ బౌలర్ రషీద్ ఖాన్.. సరికొత్త రికార్డు నెలకొల్పాడు. చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మట్ లల్లో 700 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇది రికార్డు. ఇప్పటివరకు ఈ షార్ట్ ఫార్మట్ క్రికెట్ లో ఏ బౌలర్ కూడా ఇన్ని వికెట్లు పడగొట్టలేదు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా ఈ ఘనతను అందుకున్నాడు రషీద్ ఖాన్. టీ20 ఇంటర్నేషనల్స్ లోనూ అతను అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో 16వ ఓవర్‌లో మహమ్మద్ అర్ఫాన్‌ను డకౌట్ చేయడంతో 700 వికెట్ల క్లబ్ లో చేరాడు రషీద్ ఖాన్. ఇది హిట్ వికెట్. ఆ ఓవర్ మూడో బంతిని అర్ఫాన్ రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నించాడు. అక్కడ తడబడ్డాడు. బ్యాలెన్స్ మిస్ అయ్యాడు. బ్యాట్‌తో స్టంప్స్‌ను తాకాడు. దీంతో అర్ఫాన్. దీంతో హిట్ వికెట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో 700 వికెట్ల చరిత్రను నెలకొల్పాడు రషీద్.

2015లో అరంగేట్రం చేసినప్పటి నుంచి రషీద్ ఖాన్.. ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన స్పిన్నర్‌గా ఆవిర్భవించాడు. ఇప్పటివరకు 518 టీ20 మ్యాచ్‌లను ఆడాడు. ఇందులో ఇంటర్నేషనల్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్స్ వంటివి ఉన్నాయి. వీటన్నింట్లో కలిపి 700 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడీ రైట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. అతని బౌలింగ్ యావరేజ్ 20 కంటే తక్కువే. అలాగే ఎకానమీ రేటు కూడా ఏడుకు మించిలేదు.
18 సార్లు నాలుగు వికెట్లు పడగొట్టిన ఘనత అతని సొంతం. అలాగే నాలుగుసార్లు 5- వికెట్స్ హాల్ అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం డ్వేన్ బ్రావో రెండో స్థానంలో ఉన్నాడు. 2024లో రిటైర్ అయిన డ్వేన్ బ్రావో.. టీ20 మ్యాచ్ లల్లో 631 వికెట్లు పడగొట్టాడు.
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రషీద్ ఖాన్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 114 మ్యాచ్‌లలో ఈ లెగ్ స్పిన్నర్ 13.77 అద్భుతమైన సగటుతో 191 వికెట్లు పడగొట్టాడు. అతని న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌథీ (164 వికెట్లు) ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. రషీద్ ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 లీగ్‌లలో ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో 136 మ్యాచ్‌లలో 23.83 సగటుతో 158 వికెట్లు తీశాడు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications