అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ సమీపిస్తున్న వేళ టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వరుస అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టును ఫైనల్ చేర్చిన సంజూ శాంసన్‌పై ప్రశంసలు కురిపిస్తూనే.. తడబడుతున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు విలువైన సూచనలు చేశారు.
పరిణతి చెందిన సంజూ శాంసన్
గతంలో నిలకడలేమికి మారుపేరుగా ఉన్న సంజూ శాంసన్.. ఇప్పుడు ఓ పరిపూర్ణ ఆటగాడిగా ఎదిగాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. "సంజూ చివరకు తన బాధ్యతను గుర్తించాడు. నిలకడగా ఆడాల్సిన అవసరం ఉందని, షాట్ సెలక్షన్‌లో విజ్ఞత ప్రదర్శించాలని అతను గ్రహించాడు. సంజూ వద్ద అన్ని రకాల షాట్లు ఉన్నాయి, కానీ గతంలో ఏకాగ్రత లోపించేది. ఇప్పుడు అతను మానసికంగా చాలా ధృడంగా మారాడు" అని రవిశాస్త్రి ప్రశంసించారు. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 42 బంతుల్లో 89 పరుగులు చేసిన సంజూ శాంసన్.. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌లో 97 పరుగులతో చెలరేగి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళనకరం
మరోవైపు ఓపెనింగ్ భాగస్వామి అభిషేక్ శర్మ ఫామ్ టీమిండియాను కలవరపెడుతోంది. ఈ ప్రపంచకప్‌లో 7 ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్ కేవలం 89 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్నప్పటికీ.. మెగా టోర్నీలో అతను తడబడటం చర్చనీయాంశమైంది. అయితే ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో మార్పులు చేయవద్దని రవిశాస్త్రి సూచించారు. "అభిషేక్ శర్మను ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదు. జట్టు మంచి ఫామ్‌లో ఉంది కాబట్టి అతనికే మద్దతు ఇవ్వాలి. నీ సామర్థ్యాన్ని నువ్వు నమ్ముకో, భయపడకుండా నీ సహజ సిద్ధమైన ఆటను ఆడు అని అతనికి చెప్పాలి. బహుశా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ అతని కెరీర్‌లోనే అత్యుత్తమ మ్యాచ్ కావొచ్చు" అని రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశారు.
ఫైనల్ వేటలో భారత్
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. సంజూ శాంసన్ ఇదే ఊపును కొనసాగిస్తే భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. 31 ఏళ్ల సంజూ శాంసన్ అసలైన ఆట ఇప్పుడే మొదలైందని రవిశాస్త్రి కొనియాడారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications