Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసుల గోల వేళ.. ఆర్సీబీ సంచలనం

బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఉదంతం.. ఇప్పటికీ వెంటాడుతూనే వస్తోంది. ఈ ఘటనకు కారణమైన చిన్నస్వామి స్టేడియాన్ని దాదాపుగా మూసివేశారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించనున్న మహారాజా ట్రోఫీ మ్యాచ్ లన్నింటినీ మరో చోటికి షిఫ్ట్ చేయాల్సొచ్చింది.

ఈ ఏడాది జూన్ 4వ తేదీన చిన్నస్వామి స్టేడియం వెలుపల సంభవించిన ఈ తొక్కిసలాటలో 11 మంది అభిమానులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. పలువురు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. విజయోత్సవ ర్యాలీల కోసం సరికొత్త మార్గదర్శకాలను రూపొందించడానికి కారణమైంది.

RCB Cares extended Rs 25 lakh each to the bereaved families

ఈ ఘటనపై తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ యాజమాన్యం స్పందించింది. తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఓ ప్రకటన పోస్ట్ చేసింది. అభిమానుల యోగక్షేమాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా 'ఆర్సీబీ కేర్'‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ విషాదకర ఘటన నుంచి తాము చాలా నేర్చుకున్నామని, అభిమానులకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేసింది. అందుకోసమే అభిమానుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఆర్సీబీ కేర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ కేర్ సెంటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే పంచుకుంటామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ యాజమాన్యం వివరించింది.

ఈ ఆర్సీబీ కేర్ తరఫున సంచలన ప్రకటన విడుదలైంది. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించింది. వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలను అందించినట్లు తెలిపింది. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, మరణించిన వారి కుటుంబాల పట్ల తమకు ఉన్న అనుబంధానికి నిదర్శనమని పేర్కొంది.

కష్టంలో కూడా వారికి అండగా ఉన్నామనే ధైర్యాన్ని ఇచ్చినట్టయిందని వ్యాఖ్యానించింది. ఇది ఆరంభం మాత్రమేనని, తొక్కిసలాట వల్ల నష్టపోయిన వారికి మరింత సహకారాన్ని అందిస్తామని పేర్కొంది. మున్ముందు అభిమానులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+