చేతులు మారనున్న RCB
ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్ గా ఆవిర్భవించిన జోష్ లో ఉంది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కప్ ను ముద్దాడింది. కొత్త కేప్టెన్ రజత్ పటిదార్ సారథ్యంలో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఐపీఎల్ 2025 ఫైనల్స్ లో పంజాబ్ కింగ్స్ ను మట్టికరిపించి.. విజయకేతనాన్ని ఎగురవేసింది.
ఈ ఊపులో ఉన్న ఆర్సీబీ ఫ్రాంఛైజీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ స్పిరట్స్ కంపెనీతో కలిసి ఆర్సీబీలో భాగస్వామిగా ఉంటోన్న డైజియో.. ఫ్రాంఛైజీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ జట్టులో ఉన్న తన వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా విక్రయించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

ఇందులో భాగంగా తన భాగస్వామ్య హక్కుల వాల్యుయేషన్ కూడా పూర్తి చేసింది డైజియో పీఎల్సీ. దాదాపుగా రెండు బిలియన్ డాలర్లకు వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. హక్కుల కొనుగోలుదారుల కోసం అన్వేషణ కూడా మొదలుపెట్టినట్లు బ్లూమ్ బర్గ్ తెలిపింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
డైజియో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు లేకపోలేదు. డైజియో పీఎల్సీ.. అల్కహాల్ బేవరేజెస్ సంస్థ. లండన్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. భారత్ లో యునైటెడ్ స్పిరిట్స్ తో జాయింట్ వెంచర్ ను నెలకొల్పింది. ఆర్సీబీలోనూ వాటాలను కొనుగోలు చేసింది.
ఈ సంస్థ ప్రధాన వ్యాపారం.. మద్యం. అదే ఇక్కడ ఆర్సీబీ నుంచి వైదొలగడానికి కారణమైంది. కోట్లాదిమంది వీక్షించే ఐపీఎల్ మ్యాచ్ లల్లో పొగాకు, మద్యపాన సేవనాన్ని ప్రోత్సహించేలా ఎలాంటి అడ్వర్టయిజ్ మెంట్లు ఉండకూడదంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించిన నేపథ్యంలో.. డైజియో ఈ నిర్ణయం తీసుకుంది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications