ఫైనల్స్ కు రాచబాట- అన్నీ కలిసొచ్చిన జట్టు ఇదే

RCB vs PBKS Qualifier 1: ఐపీఎల్ 2025లో కీలక దశ మొదలైంది. నేటి నుంచి నాకౌట్స్ ఆరంభం కానున్నాయి. నేడు క్వాలిఫయర్ 1 షెడ్యూల్ అయింది. ఈ సాయంత్రం 7:30 గంటలకు ముల్లాన్ పూర్.. ఈ బిగ్ గేమ్ కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ ను ఢీకొట్టబోతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కు వెళ్తుంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లే టాప్ 2లో ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు జట్లకూ 19 చొప్పున పాయింట్లు ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ కంటే నెట్ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉండటం వల్ల పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది.

RCB set to take PBKS in IPL 2025 Qualifier 1 today

11 సంవత్సరాల తరువాత పంజాబ్ కింగ్స్ మొదటిసారిగా ప్లేఆఫ్స్ ఆడబోతోంది. 2014లో చివరిసారిగా నాకౌట్స్ ఆడిందా జట్టు. కోల్ కత నైట్ రైడర్స్ తో క్వాలిఫయర్ 1లో ఓడిపోయింది. ఎలిమిటర్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను మట్టికరిపించి మరీ ఫైనల్స్ చేరింది గానీ.. విజేతగా ఆవిర్భవించలేకపోయింది. కోల్ కత నైట్ రైడర్స్ చేతిలో పరాజయాన్ని చవి చూసింది. రన్నరప్ తో సరిపెట్టుకుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది సంవత్సరాల తరువాత క్వాలిఫయర్ 1 ఆడనుంది. 2016 తరువాత మళ్లీ అదే సీన్ ను రిపీట్ చేస్తోంది. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది బెంగళూరు. చివరి లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై విశ్వరూప ప్రదర్శన చేసింది. 227 పరుగులను కొట్టి అవతలపడేసింది.

అదే ఊపును క్వాలిఫయర్ 1లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో తుదిజట్టు ఎంపికలో ఆచితూచి వ్యవహరించనుంది. ఇంపాక్ట్ ప్లేయర్ గా రజత్ పటిదార్ ను కొనసాగించకపోవచ్చు. తుదిజట్టులో అతన్ని తీసుకోవచ్చు. సుయాష్ శర్మను ఇంపాక్ట్ సబ్ గా సెలెక్ట్ చేయవచ్చు.

ఆర్సీబీ తుదిజట్టులో- విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్ (కేప్టెన్), మయాంక్ అగర్వాల్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్ ను తీసుకునే అవకాశం ఉంది. ఇంపాక్ట్ సబ్: సుయాష్ శర్మ ఉండొచ్చు.

పంజాబ్ కింగ్స్ తుదిజట్టులో- ప్రభ్‌ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), జోస్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ ప్రీత్ బ్రార్, కైలె జెమిసన్, అర్ష్‌ దీప్ సింగ్ ఆడొచ్చు. ఇంపాక్ట్ సబ్ గా యుజ్వేంద్ర చాహల్ ను తీసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+