ఢిల్లీ కేపిటల్స్ సంచలనం: రికీ పాంటింగ్‌పై వేటు

Delhi Capitals Ricky Ponting: ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీ.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. హెడ్ కోచ్‌ రికీ పాంటింగ్‌‌పై వేటు వేసింది. అతన్ని తొలగించింది. కొద్దిసేపటి కిందటే ఈ విషయాన్ని ప్రకటించింది. రికీ పాంటింగ్‌తో ఫ్రాంఛైజీకి ఉన్న ఏడు సీజన్ల అనుబంధానికి దీనితో తెరపడినట్టయింది.

2008లో ఈ ప్రీమియర్ లీగ్ ఆరంభం కాగా.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవని జట్లల్లో ఒకటి- ఢిల్లీ కేపిటల్స్. ఆస్ట్రేలియాకు ఐసీసీ వరల్డ్ కప్‌ను అందించిన రికీ పాంటింగ్..ఆ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలను స్వీకరించినా ఆ జట్టు తలరాతలో ఎలాంటి మార్పూ రాలేదు.

Ricky Ponting has stepped down as the head coach of Delhi Capitals

2018లో తొలిసారిగా ఢిల్లీ కేపిటల్స్ హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు రికీ పాంటింగ్. కోచ్‌గా అతని సారథ్యంలో కొన్ని బెస్ట్ సీజన్లను నమోదు చేసుకుంది. 2020 సీజన్‌లో ఫైనల్స్ సైతం చేరుకుంది గానీ.. దురదృష్టవశావత్తూ దాన్ని విజయంగా మలచుకోలేకపోయింది. ఢిల్లీ కేపిటల్స్ ప్రస్థానంలో ఇదే బెస్ట్ మూమెంట్.

ఈ సీజన్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది డీసీ. ఆడిన మొత్తం 14 మ్యాచ్‌లల్లో ఏడింట్లో విజయాలను అందుకుంది. లీగ్స్ ముగిసే సమయానికి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.

కాగా- రికీ పాంటింగ్ స్థానంలో ఢిల్లీ కేపిటల్స్ ఎవరిని హెడ్ కోచ్‌గా అపాయింట్ చేస్తుందనేది ఇంకా వెల్లడి కాలేదు. టీమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్న బీసీసీఐ మాజీ ఛైర్మన్ సౌరవ్ గంగూలికే అదనంగా హెడ్ కోచ్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో- అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే పేరును కూడా హెడ్ కోచ్ రేసులో ఉన్నాట్లు తెలుస్తోంది.

కోల్‌కత నైట్ రైడర్స్ కూడా ప్రస్తుతం కొత్త హెడ్ కోచ్ అన్వేషణలో పడిన విషయం తెలిసిందే. ఇదివరకు ఈ స్థానంలో పని చేసిన గౌతమ్ గంభీర.. భారత జట్టు హెడ్ కోచ్‌గా అపాయింట్ అయిన విషయం తెలిసిందే. దీనితో ఈ ఖాళీని భర్తీ చేసే ప్రయత్నాల్లో పడింది. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను తీసుకోవచ్చని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+