అడ్డంగా బుక్ అయిన కేప్టెన్ సాబ్: సీసీటీవీ ఫుటేజీలో
ఐపీఎల్ లో ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్ జోరుకు బ్రేకులు పడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి చవి చూసిందీ జట్టు. తొలుత బ్యాటింగ్ కు దిగిన పీబీకేఎస్ నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ దీన్ని అలవోకగా అధిగమించింది. 19.2 ఓవర్లల్లో నాలుగు వికెట్లు కోల్పోయి 228 పరుగులు సాధించింది. ఆర్ఆర్ లో డెనవాన్ ఫెరీరా టాప్ స్కోరర్, 52 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్- 51, వైభవ్ సూర్యవంశీ- 43 పరుగులతో సుడిగాలి ఇన్నింగ్ ఆడారు.
ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ కేప్టెన్ రియాన్ పరాగ్ వివాదంలో చిక్కుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అతను వాపింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్ సమయంలో ఒక బ్రాడ్‌కాస్ట్ కెమెరాలో పరాగ్ వాప్ పట్టుకుని ఉన్నట్లు కనిపించిందీ క్లిప్ లో. 16 బంతుల్లో 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రియాన్ పరాగ్ ఈ మ్యాచ్ లో. డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చిన వెంటనే వాపింగ్ చేస్తూ కనిపించాడు. వాపింగ్ అంటే.. ఈ- సిగరెట్ తాగడం.

వాపింగ్‌పై ఎటువంటి స్పష్టమైన నిబంధనలు లేవు. స్టేడియంలలో ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించి బీసీసీఐ కఠినమైన మార్గదర్శకాలను అమలు చేస్తుంది గానీ అందులో వాపింగ్ కు సంబంధించిన నియమాలు పొందుపర్చలేదు. ఆరోగ్యం, భద్రతా ప్రోటోకాల్‌ల ప్రకారం డ్రెస్సింగ్ రూమ్‌లు లేదా డగౌట్‌లలో పొగాకు లేదా సంబంధిత ఉత్పత్తుల వాడకంపై నిషేధం ఉంది. ఇది ఇ-సిగరెట్ కావడం వల్ల బీసీసీఐ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి. స్మోకింగ్ గానే పరిగణిస్తే రియాన్ పరాగ్‌కు శిక్ష పడొచ్చు.
Riyan parag smoking vape in dressing room .. is this legal @IPL pic.twitter.com/91yqwH105e
— Prxtham.Edits18 (@Prxtham_Edits18) April 28, 2026
ఈ సీజన్ లో రియాన్ పరాగ్ పెద్దగా ఆడట్లేదు. సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లిన తర్వాత అతని స్థానాలో రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన పరాగ్ 107 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లో నిలకడ కోల్పోయాడు. విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతకుముందు ఏప్రిల్ 10న గువాహతి స్టేడియంలో మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు ఆర్ఆర్ టీమ్ మేనేజర్ రోమి భిందర్‌కు లక్ష జరిమానా పడింది.
🚨 RIYAN PARAG VAPING DURING MATCH 🚨
— MARCUS (@MARCUS907935) April 28, 2026
Not a good look for a professional. pic.twitter.com/QaDIO8lThE












Click it and Unblock the Notifications