భార్యకు విడాకులిచ్చి..ఆమెను సెట్ చేసుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్..?
టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. చాహల్ వైవాహిక జీవితంపై గత కొద్ది రోజులుగా అనేక వార్తలు వైరల్ అయ్యాయి. చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకొంటున్నారంటూ కొంతకాలం ప్రచారం జరిగింది.చాహల్ భార్య ధనశ్రీ వర్మ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. ధనశ్రీ వర్మ డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు ఉంది.
ధనశ్రీ వర్మ తెలుగులో హీరోయిన్‌గా కూడా నటిస్తోంది. అయితే కొంతకాలంగా చాహల్,ధనశ్రీ వర్మల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో వీరు వీడిగా ఉంటున్నారనే ప్రచారం ఊపందుకుంది.ఇదే సమయంలో చాహల్ తన భార్య ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించాడు. ధనశ్రీ కూడా చాహల్‌ను అన్‌ఫాలో చేసింది. అంతకు ముందు ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుంచి భర్త పేరుని తొలగించింది. దీంతో అప్పటి నుంచి వీరి విడాకుల గురించి పుకార్లు చేస్తున్నాయి.ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో నిజంగానే విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం జరిగింది.

మొత్తానికి అందరూ అనుకున్నట్టుగానే చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకున్నారు. ఈ జంట విడాకులు తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.2022 నుంచే వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ధన శ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ చెల్లించనట్టు తెలుస్తోంది.దీనిలో భాగంగానే ఇప్పటివరకు రూ.2.37 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అయితే భార్యకు విడాకులు ఇవ్వగానే చాహల్ మరో అమ్మాయితో రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నాడనే ప్రచారం తెర మీదకు వచ్చింది.
చాహల్ ఇటీవల తరుచూ ఓ అమ్మాయితో కలిసి దర్శనం ఇస్తున్నాడు.ఆమె మరెవరో కాదు ఆర్జే మహవాష్.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో తొలిసారి వీరిద్దరూ కలిసి కనిపించారు. దీంతో అప్పటి నుంచి వీరు డేటింగ్ ఉన్నారనే పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కూడా ఈ భామ సందడి చేస్తోంది. తాజాగా చాహల్ మరోసారి మహవాష్‌తో కలిసి కనిపించాడు. వీరిద్దరు దిగిన సెల్ఫీని చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ మరోసారి ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వీరిద్దరు దిగిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ ప్రచారంపై చాహల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.












Click it and Unblock the Notifications