IPL 2026: CSK కెప్టెన్ మార్పు ? రుతురాజ్ స్ధానంలో ...!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ipl 2026)లో అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశపరుస్తున్న జట్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి. ఒకప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో పలు టైటిల్లు గెలిచి, ప్రతీ టోర్నీలోనూ హాట్ ఫేవరెట్ గా ఉండే సీఎస్కే జట్టు గురించి గత ఐపీఎల్ నుంచి ఫ్యాన్స్ పట్టించుకోవడమే మానేశారు. దీనికి ప్రధాన కారణం జట్టు కెప్టెన్సీయే. 2024లో ధోనీ నుంచి కెప్టెన్సీ అందుకున్న రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) తొలి సీజన్ ఫర్వాలేదనిపించినా గత సీజన్ లో ఐదు మ్యాచ్ లే ఆడాడు.

ఈసారి ఐపీఎల్ లోనూ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీతో పాటు ఆటతీరు కూడా పతనమైంది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచ్ లలో రుతురాజ్ స్కోర్లు 6, 28, 7, 15, 7, 19. దీన్ని బట్టి అతని ఆటతీరు అర్దం చేసుకోవచ్చు. దీనికి తోడు ఫీల్డింగ్ లో తప్పిదాలు, కెప్టెన్సీ తప్పిదాలు అన్నీ కలిసి అతనిపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో రుతురాజ్ ను తప్పించి మరొకరికి అవకాశం ఇచ్చే విషయాన్ని టీమ్ ఫ్రాంచైజీ పరిశీలించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

Ruturaj Out Samson In Mounting Pressure on CSK to Make Captaincy Change Now

ఈ సీజన్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ సంజూ శాంసన్ (Sanju Samson) రాకతో రుతురాజ్ గైక్వాడ్ పై ఒత్తిడి అమాంతం పెరిగిందని సీఎస్కే మాజీ ప్లేయర్ సుబ్రమణియం బద్రీనాథ్ అభిప్రాయపడ్డారు. సీఎస్కే యాజమాన్యం అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించి, ఆ బాధ్యతను సంజు సామ్సన్‌కు అప్పగించే విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.. అతను కెప్టెన్‌గా ఘోరంగా విఫలమవుతున్నాడని కాదు, కానీ కెప్టెన్సీ భారం అతని బ్యాటింగ్‌లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

Ruturaj Out Samson In Mounting Pressure on CSK to Make Captaincy Change Now

రుతురాజ్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడని అతని ముఖంలోనే కనిపిస్తోందని, ఒత్తిడిని తగ్గించుకోవడానికే, సీఎస్కే అతని స్థానంలో సంజును కెప్టెన్‌గా నియమించగలదా?" అని సుబ్రమణియం బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నారు. రుతురాజ్ రాణించడం ప్రారంభించాలని, ఓపెనింగ్ చేస్తూ, పవర్‌ప్లేలో బ్యాటింగ్ చేస్తూ విఫలమవుతున్నప్పుడు ఆరు మ్యాచ్‌లు చాలా ఎక్కువ అన్నారు. ఈ నేపథ్యంలో సీఎస్కే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+