చెన్నై సూపర్ కింగ్స్ లో ఇంకో టికెట్ కట్

ఈ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పరిస్థితి అధ్వాన్నం. ఏదీ కలిసి రావట్లేదు. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచ్ లల్లో నాలుగింట్లో ఓడింది. నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్ లల్లో విజయాలు సాధించి గాడినపడిందనుకునే లోపే సన్ రైజర్స్ హైదరాబాద్ రూపంలో భారీ అడ్డంకి ఎదురొచ్చింది. దీన్ని అధిగమించలేక చతికలిపడిందా మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్. అటు ధోనీ కూడా అందుబాటులో ఉండట్లేదు. అదిగో ఇదిగో అంటూ ప్రతి మ్యాచ్ కూ దాటవేస్తోన్నాడు.

ఈ పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు మరో షాక్ తగిలింది. యంగ్ స్టార్ బ్యాటర్ ఆయుష్ మాత్రే జట్టుకు దూరం అయ్యాడు. చెన్నై జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఇతనొక్కడే. హామ్‌స్ట్రింగ్ గాయంతో ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. మొదట్లో మూడు వారాల పాటు అందుబాటులో ఉండబోడని భావించినప్పటికీ.. అది రివర్స్ అయింది. మాత్రేకు స్కానింగ్ తీయించగా.. గాయం తీవ్రత తెలిసివచ్చింది. రెండు నెలల పాటు అతనికి విశ్రాంతి అవసరమని తేల్చారు.

Chennai Super Kings Suffer Setback as Ayush Mhatre Is Ruled Out of IPL No Dhoni Comeback Sight

శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా మాత్రేకు గాయం అయింది. రన్ తీస్తుండగా గాయపడ్డాడు. ఫిజియో టామీ సిమ్‌సెక్ చికిత్స తర్వాత కూడా అతను ఇబ్బంది పడ్డాడు. కనీసం సింగిల్ తీయలేకపోయాడు. ఆ తర్వాత ఓ తొందరపాటు షాట్‌తో అవుట్ అయ్యాడు. తన సహచరుడు రామకృష్ణ ఘోష్, ఫిజియో సహాయంతో మైదానం వీడాడు. ఈ గాయం వల్ల మాత్రే కనీసం నాలుగు మ్యాచ్‌లకు దూరం కావొచ్చని వార్తలొచ్చాయి.

23న ముంబై ఇండియన్స్, 26న గుజరాత్ టైటాన్స్, మే 2న ముంబై ఇండియన్స్, 5న ఢిల్లీ కేపిటల్స్ తో మ్యాచ్ లకు అతను దాదాపుగా ఆడకపోవచ్చని భావించారు. ముంబైలో అతనికి స్కాన్‌ తీశారు. గాయం తీవ్రత అంచనాలకు మించి ఉన్నట్లు గుర్తించారు. దీంతో మొత్తం టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. మే 10న లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్‌కు తిరిగి వస్తాడని అనుకోవడం కూడా తొందరపాటే అయింది దీంతో.

గాయానికి ముందే ఆయుష్ మాత్రే హామ్‌స్ట్రింగ్‌కు బ్యాండేజీ కనిపించింది. దీంతో అతను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాడు. మాత్రే గాయంపై హస్సీ మాట్లాడాడు. హామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీగా తేల్చాడు. స్కాన్ తర్వాతే దాని తీవ్రత తెలుస్తుందని చెప్పాడు. అతని గాయం వల్ల జట్టుకు నష్టమేనని, బెంచ్‌పై ఉన్న ఇతర ఆటగాళ్లకు అవకాశం వస్తుందని పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+