మరో 3 సార్లు ప్రెగ్నెంట్ అవుతానేమో..సానియా మీర్జా షాకింగ్ కామెంట్స్
టెన్నిస్ కోర్టుల్లో తన మెరుపు షాట్లతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన సానియా మీర్జా, తాజాగా తన మాటల తూటాలతో అభిమానులను ఆశ్చర్యపరిచారు. "మరో మూడు సార్లు ప్రెగ్నెంట్ అవుతానేమో" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఈ మాటల వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటంటే... మాతృత్వం ఆమెకు అందించిన అనుభవం గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
సానియా తన మొదటి గర్భధారణ , కుమారుడు ఇజాన్ మిర్జా మాలిక్‌కు జన్మనిచ్చిన తర్వాత ఎదుర్కొన్న అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. గర్భం దాల్చడం ఒక అద్భుతమైన అనుభవం అయినప్పటికీ, బిడ్డకు పాలివ్వడం మాత్రం ఆమెకు చాలా కష్టంగా అనిపించిందట. నిద్రలేని రాత్రులు, నిరంతరాయంగా బిడ్డకు ఆహారం ఇవ్వాల్సిన పరిస్థితి ఆమెను శారీరకంగా , మానసికంగా బాగా అలసిపోయేలా చేసింది.

ఈ కష్టమైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూనే సానియా చమత్కారంగా వ్యాఖ్యానించారు. "నేను మరో మూడు సార్లు గర్భవతి అయినా అవుతానేమో కానీ, ఆ పాలిచ్చే వ్యవహారం మాత్రం మళ్లీ చేయగలనో లేదో నాకు తెలియదు" అని ఆమె నవ్వుతూ అన్నారు. ఈ మాటల్లో ఆమె మాతృత్వాన్ని ఎంతగా ఆస్వాదిస్తున్నారో, అదే సమయంలో బిడ్డ ఆలనాపాలనా ఎంత బాధ్యతతో కూడుకున్నదో తెలియజేశారు.
ఇక సానియా మీర్జా వైవాహిక జీవితం విషాదాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. సానియా మీర్జా తన 15 ఏళ్ల దాపంత్య జీవితానికి గుడ్ చెప్పింది. భర్త షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవడంతో .. అతనితో సానియా మీర్జా బంధం తెగిపోయినట్టు అయింది. షోయబ్ మాలిక్ పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ ఎఫైర్ పెట్టుకున్నాడని..ఆ కారణంగానే సానియా మీర్జాతో అతను దూరంగా ఉంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వార్తలను నిజం చేస్తూ సనా జావేద్‌ను షోయబ్ పెళ్లాడాడు. సానియా మాత్రం సింగిల్‌గానే తన కొడుకుతో జీవితాన్ని సాగిస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications