ఆ ఐపీఎల్ టీమ్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా స్టార్ బ్యాటర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నిలకడగా సత్తా చాటుతోన్న ప్లేయర్లల్లో ఒకడు.. సంజు శాంసన్. వికెట్ కీపర్ బ్యాటర్. అటు టీమిండియా తరఫున టీ20 ఇంటర్నేషనల్స్ లోనూ అదరగొడుతున్నాడు. ఈ ఫార్మట్ లో ఇప్పటివరకు మూడు సెంచరీలు బాదాడు. ఈ రికార్డు అతి కొద్దిమందికి మాత్రమే ఉంది. దశాబ్దానికి పైగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడీ మలయాళీ క్రికెటర్. 2013లో రాజస్థాన్ రాయల్స్ తో టై అప్ అయ్యాడు. అప్పటి నుంచీ అదే జట్టులో కొనసాగుతున్నాడు.

2018లో అతన్ని రిలీజ్ చేసినప్పటికీ.. మళ్లీ అదే ఫ్రాంఛైజీ అతన్ని రిటైన్ చేసుకుంది. 18 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ పొడిగించుకుంది. సుదీర్ఘకాలంగా జట్టు కేప్టెన్ గా వ్యవహరిస్తోన్నాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ బై చెప్పాలని సంజు శాంసన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026లో సీజన్ నుండి ఆ జట్టుతో కొనసాగకపోవచ్చు. ఈ డిసెంబర్ లో జరిగే మెగా ఆక్షన్ కోసం ఫ్రాంఛైజీ ముందు రెండు ఆప్షన్లు పెట్టాడు. ఒకటి- తనను ట్రేడింగ్ చేయడం, రెండోది- రిలీజ్ చేయడం.

Sanju Samson Set for Team Change Before IPL 2026 Auction

ఈ రెండింట్లో రిలీజ్ కే అతను మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ను అధికారికంగా కోరినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. సంజు శాంసన్ ను జట్టులో చేర్చుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తిగా ఉందని, ఈ విషయంపై ఇప్పటికే అతన్ని సంప్రదించిందని చెబుతున్నారు. దీంతో సంజు శాంసన్- రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ మధ్య అంతర్గతంగా సమస్యలు ఉన్నాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ ప్లానింగ్ లో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ఇప్పుడతను ఢిల్లీ కేపిటల్స్ కు వెళ్లనున్నాడు. దీనికి సంబంధించిన వ్యవహారాలు లాంఛనంగా పూర్తయినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పరస్పరం మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. సంజు శాంసన్ ఢిల్లీ కేపిటల్స్ కు వెళ్లేలా, అక్కడ ఉన్న ట్రిస్టన్ స్టబ్స్ రాజస్థాన్ రాయల్స్‌కు షిఫ్ట్ చేసేలా ఈ రెండు ఫ్రాంఛైజీలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. సంజు శాంసన్-ట్రిస్టన్ స్టబ్స్ ట్రేడ్ డీల్ పై ఇరు ఫ్రాంచైజీల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయి. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుండి నిష్క్రమించడం ఖాయం కావడంతో.. అతన్ని తీసుకోవడానికి ఢిల్లీ కేపిటల్స్ ముందుకొచ్చింది. సంజు శాంసన్‌ను తమ జట్టులోకి తీసుకోవడానికి స్టబ్స్ ను రిలీజ్ చేయడానికి సుముఖత చూపట్లేదని వివరించింది. స్టబ్స్ తో పాటు మరొక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను కూడా రాజస్థాన్ రాయల్స్ కోరిందని దీన్ని క్యాపిటల్స్ అంగీకరించట్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+