టీమిండియాలో అతనితోనే మాకు ముప్పు, గేమ్ ఛేంజర్ - అక్కడే మా విజయం.. శాంట్నర్..!!

T20 World cup final India Vs New Zealand: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ ఆదివారం న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య జరగనుంది. దీనికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. రెండు మేటి జట్ల మధ్య టైటిల్ పోరు ఉత్కంఠ పెంచుతోంది. రెండు టీంలు అన్ని రంగాల్లోనూ సమ ఉజ్జీలుగా ఉన్నాయి. టాస్.. పిచ్ కీలకంగా మారాయి. టీం ఇండియా లో డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారని కివీస్ కెప్టెన్ శాంట్నర్ అంగీకరించారు. అయితే, మోస్ట్ డేంజర్ ప్లేయర్ గేమ్ ఛేంజర్ గా మారనున్నాడని.. ఆ ఆటగాడి పైన తమ విజయావకాశాలు ఆధార పడి ఉన్నాయని శాంట్నర్ చెప్పటం ఇప్పుడు మ్యాచ్ పైన మరింత ఆసక్తి పెంచుతోంది.

టీ20 ప్రపంచ కప్ లో విజేత ఎవరు. రెండు జట్ల పైన భారీ అంచనాలు నమోదు అవుతున్నాయి. రెండు జట్లలో విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో... ఒకరి పైన మరొకరు ప్రత్యేక వ్యూహాలతో ఫైనల్ పోరుకు సిద్దం అవుతున్నారు. కివీస్ సెన్సేషన్ ఫిన్ అలెన్ ను కంట్రోల్ చేయటం పైన ఇప్పుడు భారత్ బౌలింగ్ విభాగం ఫోకస్ చేసింది. ఆ బాధ్యత బూమ్రాకు అప్పగించింది. సౌతాఫ్రికా పైన ఫిన్ అలెన్ సునామీ ఇన్నింగ్స్ రిపీట్ అయితే.. మొత్తం గేమ్ మారిపోతుంది. అదే విధంగా కివీస్ బౌలర్ల ను ఎదుర్కునే అంశం.. పవర్ ప్లేలో భారత్ ఓపెనింగ్ ప్లేయర్ల బలహీనతలు ఇప్పుడు ఫైనల్ వేళ చర్చగా మారాయి. అభిషేక్ స్థానం పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అభిషేక్ వరుసగా విఫలం అవుతుండటంతో.. మూడో స్థానంలో పంపే ఆలోచన చేస్తున్నారు. అయితే, టాస్ తరువాత తుది జట్టు ను ప్రకటించే విధంగా రెండు ఆప్షన్స్ తో టీం ఇండియా సిద్దం అయింది.

santner-praised-the-talent-of-jasprit-bumrah-ahead-of-their-t20-world-cup-final-against-india

శాంట్నర్ వ్యూహాలు ఫలించేనా

ఇదే సమయంలో కివీస్ కెప్టెన్ శాంట్నర్ ఫైనల్ లో టీం ఇండియా పైన తన అంచనాలను ఓపెన్ గా వెల్లడించారు. టీమిండియాలో స్టార్ పేసర్ బుమ్రా నుంచి ముప్పు పొంచి ఉందని ప్రతి ఒక్కరూ చెప్పే మాటగా పేర్కొన్నారు. అతడి ప్రదర్శన కూడా ఈ ప్రపంచ కప్‌లో అలాగే ఉందని చెప్పారు. ఇంగ్లండ్ బ్యాటర్లు కూడా బుమ్రాను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారని గుర్తు చేసిన శాంట్నర్ ఆ మ్యాచ్‌లో అతడే గేమ్ ఛేంజర్ గా తేల్చి చెప్పారు. తమకు సవాల్ తప్పదని అంగీకరించారు. కానీ కేవలం బుమ్రాతోనే కాదు.. భారత జట్టులోని ప్రతి ఒక్క ప్లేయర్‌తోనూ తాము జాగ్రత్తగా ఉండా ల్సిందేనని విశ్లేషించారు. బ్యాటింగ్ లేదా బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ వారు ఈ దశ వరకు చేరుకున్నారన్నారు. ఒక్కొక్కసారి ఒక్కో ప్లేయర్ ముందుకు వచ్చి జట్టును విజయ పథం వైపు నడిపించారని శాంట్నర్ పేర్కొన్నారు. సారి భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేసారు. దీంతో.. టీం ఇండియా - కివీస్ పవర్ ప్లే లో అమలు చేసే వ్యూహాలు.. కట్టడి ఛాంపియన్ ను డిసైడ్ చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+