వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడి వివాహం నేడు ఘనంగా జరిగింది. సచిన్ కుమారుడు, క్రికెటర్ అర్జున్ టెండూల్కర్.. తన చిన్ననాటి స్నేహితురాలు సానియా చందోక్ మెడలో మూడు ముళ్లు వేశాడు. ముంబైలోని వర్లిలో ఓ గ్రాండ్ ఫైవ్ స్టార్ హోటల్లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగగా.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇటీవల ముంబైలో జరిగిన మెహందీ వేడుక సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వేడుకలో వధువు సానియా చందోక్ కంటే.. అర్జున్ సోదరి సారా టెండూల్కర్ పైనే ఎక్కువగా నిలిచింది. తన రాయల్ లుక్‌తో సారా టెండూల్కర్ ఈ ఫంక్షన్‌లో అసలైన 'లైమ్‌లైట్'ను సొంతం చేసుకుంది.
మెరిసిన సారా..
నేడు పెళ్లి వేడుకల్లో కూడా సారా టెండూల్కర్ పింక్ కలర్ సారీలో మెరిసింది. మెడలో దగదగ మెరిసే నగల వెలుతురులో రాకుమారిలా కనిపించింది. సారాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. వధువు కంటే వదినే అందంగా ఉందంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు
Sara Tendulkar's look for her brother Arjun's wedding ❤️ pic.twitter.com/vQlM4KnPkx
— Deepu (@deepu_drops) March 5, 2026
బాంధని లెహంగాలో రాజకుమారిలా సారా!
ఇటీవల మెహందీ ఫంక్షన్ కోసం సారా టెండూల్కర్ ఎంచుకున్న అవుట్‌ఫిట్ అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన 'బాంధని లెహంగా'లో ఆమె మెరిసిపోయింది. పర్పుల్ కలర్ బేస్‌పై మల్టీకలర్ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్ ఉన్న ఈ లెహంగాకు తోడు గ్రీన్ కలర్ దుపట్టా ఆమెకు ఒక రాయల్ లుక్‌ను ఇచ్చింది.

జుట్టులో పరాంద.. నుదుట తలపాగా
సారా తన లుక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి జుట్టుకు ట్రెడిషనల్ 'పరాంద' (పంజాబీ శైలి జడ గంటలు) ధరించింది. నుదుట భారీ మాంగ్ టీకా, కుందన్, ముత్యాలతో కూడిన నెక్లెస్‌తో ఆమె ఒక యువరాణిలా కనిపించింది. గ్లోయింగ్ మేకప్, మెహందీతో నిండిన చేతులు ఆమె సహజ సౌందర్యాన్ని మరింత పెంచాయి. సారా స్టైలిష్ ఎంట్రీ చూసిన నెటిజన్లు, ఆమె తన వదిన కంటే ఎక్కువగా మెరిసిపోతోందని కామెంట్స్ చేస్తున్నారు.
సిల్వర్-పేస్టల్ లుక్‌లో వధువు సానియా
మరోవైపు అర్జున్ టెండూల్కర్ కాబోయే భార్య సానియా చందోక్ కూడా మెహందీ వేడుకలో ఎంతో హుందాగా కనిపించింది. ఆమె సిల్వర్, పేస్టల్ షేడ్ ఉన్న హెవీ లెహంగాను ధరించింది. సానియా సింపుల్ చోకర్ నెక్లెస్, బుట్టలు, వెవీ హెయిర్ స్టైల్‌తో ఎంతో ఎలిగెంట్‌గా కనిపించింది. ఆమె మేకప్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉండటంతో ఒక 'డ్రీమీ లుక్'ను సంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో సారా హవా!
అర్జున్-సానియా మెహందీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫ్యాషన్ ప్రియులు మాత్రం సారా గుజరాతీ స్టైల్ వైపు మొగ్గు చూపుతున్నారు. "వధువు కంటే వదిన బాగుంది", "సారా టెండూల్కర్ గ్రేస్ అద్భుతం" అంటూ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సానియా తన పేస్టల్ లెహంగాలో అందంగా ఉన్నప్పటికీ.. సారా వైబ్రెంట్ కలర్స్, ట్రెడిషనల్ పరాంద లుక్ ముందు వధువు లుక్ కాస్త ఫీకాగా అనిపించిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications