కొత్తోడైనా టీమిండియా బౌలింగ్ ను తుక్కు రేగ్గొట్టేశాడు భయ్యా.. తొలి టెస్ట్ సెంచరీ
గువాహటి వేదికగా జరుగుతున్న భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు సాధించింది. భారత సంతతికి చెందిన ఆల్‌రౌండర్ సేనురన్ ముత్తుసామి తన తొలి టెస్టు శతకం సాధించాడు. తన జట్టును పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. రెండో రోజు ఆటలో భారత్‌కు నిరాశను మిగిల్చాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో తన కెరీర్‌లో అత్యుత్తమ టెస్టు ఇన్నింగ్స్‌ఆడాడు ముత్తుస్వామి. ఈ శతకం దక్షిణాఫ్రికాకు మ్యాచ్‌పై పూర్తి నియంత్రణను ఇచ్చింది.
అతని బ్యాటింగ్ ధాటికి బౌలర్లకు దిక్కుతోచలేదు. ముత్తుస్వామి ఆడే షాట్లకు సమాధానాల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. తన కేరీర్ లో ఎనిమిదో టెస్టు ఆడుతున్న ముత్తుసామి 192 బంతుల్లో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్.. 89. పాకిస్తాన్‌పై అజేయంగా 89 పరుగులు చేశాడు. ఇప్పుడీ స్కోర్ ను అధిగమించాడు. అత్యంత పటిష్టమైన భారత బౌలింగ్ కు ఎదురొడ్డి నిలిచాడు.

ఓవర్‌నైట్ ఆటగాళ్లు ముత్తుసామి, కైల్ వెర్రెయిన్.. మార్నింగ్ సెషన్‌లో అదరగొట్టారు. 121 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత ముత్తుస్వామి చెలరేగాడు. దూకుడుగా ఆడాడు. అద్భుతమైన టెక్నిక్ తో బౌలర్ల తుక్కు రేగ్గొట్టాడు. టీ తర్వాత వెర్రెయిన్ 122 బంతుల్లో 45 పరుగులు చేసి స్టంపౌట్ అయినప్పటికీ, దక్షిణాఫ్రికా దూకుడు తగ్గలేదు. ముత్తుసామికి మార్కో జాన్సెన్ తోడయ్యాడు. ఈ జోడి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దక్షిణాఫ్రికా 400 పరుగుల మార్కును దాటేలా చేసింది. జన్ సెన్ కూడా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
1994 ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికా డర్బన్‌లో జన్మించాడు ముత్తుస్వామి. అతని పూర్వీకులది తమిళనాడులోని నాగపట్నం. ఉపాధి కోసం అతని తల్లిదండ్రులు దక్షిణాఫ్రికాకు వలసవెళ్లారు. అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఇప్పటికీ నాగపట్నంలో నివసిస్తున్నారు. క్లిఫ్టన్ కాలేజీలో చదువుకున్న ముత్తుసామి.. యూనివర్శిటీ ఆఫ్ క్వాజులు-నటాల్ నుండి సోషల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. అతని క్రికెట్ ప్రయాణం డర్బన్‌లో ప్రారంభమైంది.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
రూ.48కే హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications