భారత్ చేతిలో ఓటమి.. రిపోర్టర్‌పై విండీస్ కెప్టెన్ ఫైర్!

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన సూపర్-8 పోరులో భారత్ వెస్టిండీస్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ఆడిన స్లో ఇన్నింగ్స్ ఇప్పుడు విమర్శలకు దారితీసింది. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో తన బ్యాటింగ్ వేగంపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కాస్త ఘాటుగానే సమాధానమిచ్చాడు.

నెమ్మదిగా ఆడటంపై రిపోర్టర్ ప్రశ్న.. హోప్ అసహనం
ఈ మ్యాచ్‌లో షాయ్ హోప్ 33 బంతుల్లో కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. ఒక దశలో 8 బంతుల్లో 2 పరుగులే చేసి తీవ్రంగా తడబడ్డాడు. దీనిపై రిపోర్టర్ పదే పదే ప్రశ్నించగా హోప్ అసహనానికి గురయ్యారు. "మీరు నన్ను నవ్విస్తున్నారు. నేను బాధ్యత తీసుకోవాలని మీరు వినాలనుకుంటే.. సరే, నేనే బాధ్యత తీసుకుంటున్నాను. నేను ఇంకా వేగంగా బ్యాటింగ్ చేయాల్సింది. కానీ క్రీజులో ఇబ్బంది పడుతున్నప్పుడు ఏ ఆటగాడికైనా కష్టంగానే ఉంటుంది. నేను మరీ దారుణంగా ఆడానని అనుకోవడం లేదు. ఫీల్డర్లకే క్యాచ్‌లు ఇచ్చాను తప్ప, పరిస్థితికి తగ్గట్టుగా ఆడటానికే ప్రయత్నించాను" అని షాయ్ హోప్ ఘాటుగా సమాధానమిచ్చారు.

Shai Hope Fumes at Reporter After Loss Defends Slow Batting Against Team India in T20 World Cup 2026

స్పిన్నర్ల ఉచ్చులో షాయ్ హోప్!
వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వంటి భారత స్పిన్నర్ల బౌలింగ్‌లో స్ట్రైక్ రొటేట్ చేయడానికి షాయ్ హోప్ చాలా కష్టపడ్డాడు. హార్దిక్ పాండ్యా ఓవర్‌లో ఒక సిక్స్, ఫోర్ కొట్టి టచ్‌లోకి వచ్చినట్లు అనిపించినా.. వెంటనే స్పిన్ బౌలింగ్‌లో మళ్ళీ నెమ్మదించాడు. రోస్టన్ చేజ్ (25 బంతుల్లో 40) వేగంగా ఆడుతున్నా.. హోప్ మాత్రం గేర్ మార్చలేకపోయాడు. చివరికి విండీస్ 20 ఓవర్లలో 195/4 పరుగులు చేసింది.

సంజూ మెరుపులు.. విండీస్ ఇంటికి!
వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. సంజూ శాంసన్ 50 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి అద్భుత విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో వెస్టిండీస్ వరల్డ్ కప్ ప్రయాణం ముగియగా.. టీమిండియా సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. మ్యాచ్ గెలిచిన ఆవేశంలో సంజూ శాంసన్ తన హెల్మెట్‌ను నేలకేసి కొట్టడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+