మొహసిన్ నక్వీని డీప్ ఫ్రై చేసిన అఖ్తర్

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోర పరాజయం తర్వాత, ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్‌ అఖ్తర్ నిప్పులు చెరిగాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, దాని లీడర్ షిప్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొలంబోలోని ఆర్‌ ప్రేమదాస స్టేడియంలో ఆదివారం భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. ఈ ఓటమి నేపథ్యంలో పీసీబీ ఛైర్మన్ మోహసిన్ నఖ్వీని పరోక్షంగా అఖ్తర్ లక్ష్యంగా చేసుకున్నారు.

మ్యాచ్ ముగిసిన అనంతరం ఏబీపీ న్యూస్‌తో అతను మాట్లాడాడు. పీసీబీ పనితీరు, జాతీయ జట్టు నిర్వహణ పట్ల తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చాడు. ముఖ్యంగా భారత్ వంటి అగ్రశ్రేణి జట్లు, మ్యాచ్ లో కీలక సమయాల్లో రాణించని సీనియర్ ఆటగాళ్లను పీసీబీ సపోర్ట్ చేయడాన్ని తప్పుపట్టాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్ వంటి సీనియర్ ప్లేయర్లు పేలవ ప్రదర్శనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు అఖ్తర్.

Shoaib Akhtar Takes a indirect Dig at PCB Chief Mohsin Naqvi After loss the game to India in Colombo

మోహసిన్ నఖ్వీ సమర్థతను ప్రశ్నించాడు. ఆయన పేరును ప్రస్తావించకుండా చురకలు అంటించాడు. ఓ వ్యక్తికి తాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌నని కూడా తెలియట్లేదని ఎద్దేవా చేశాడు. జట్టులో ఒకరిద్దరి మీదే డిపెండ్ కావాల్సిన దుస్థితిని పీసీబీ కల్పించిందని మండిపడ్డాడు. జట్లులో ఒక్కడినే సూపర్‌స్టార్‌గా భావిస్తోన్నాడని, అతనేమో కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా ఆడలేడని వ్యాఖ్యానించాడు. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని స్టార్‌గా అతన్ని తయారు చేశారని విమర్శించాడు.

అసమర్థులకు కీలక పదవులు అప్పగించడంపై అక్తర్ తీవ్రంగా విమర్శించాడు. ఈ రకమైన ఒకరిద్దరు స్టార్ లను తయారు చేసినప్పుడు.. ఫలితాలు కూడా అలాగే ఉంటాయని, ఎప్పుడో గానీ గెలవని పరిస్థితి వచ్చిందని మండిపడ్డాడు. జట్టులో అలాంటి వారిని ఎంపిక చేసినప్పుడు అసలు సమస్యను ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ఒక అసమర్థుడికి కీలక బాధ్యతలను అప్పగించడం ప్రపంచంలోనే అతిపెద్ద నేరమని ధ్వజమెత్తాడు.

అర్హత లేని వ్యక్తులను అధికార పదవుల్లో నియమించడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని అక్తర్ హెచ్చరించాడు. అసమర్థుడు, అజ్ఞాని అయిన ఓ వ్యక్తికి పెద్ద పని అప్పగిస్తే, అతను దేశాన్ని నాశనం చేస్తాడని తేల్చి చెప్పాడు. అలాంటి వ్యక్తి ఎక్కడ ఉన్నా, ఏ సంస్థలో ఉన్నా దాన్ని పతనం చేస్తాడని అన్నాడు. ఉదాహరణ మన కళ్ళ ముందే ఉందని, ఇది ఎవరికి అర్థం కావాలో.. వారికి అర్థమై ఉంటుందని అని అక్తర్ చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+