అందుకే నన్ను సెలెక్ట్ చేయలేదు- బీసీసీఐపై బాంబు పేల్చిన శ్రేయాస్

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025కు గడువు సమీపించింది. ఇంకో మూడు రోజులే మిగిలివుంది. ఈ నెల 9వ తేదీన ఈ టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. 28వ తేదీన ఫైనల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. దీనికి వేదిక. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్‌లో జరుగుతుంది. ఈ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి.

మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టోర్నమెంట్ లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ గ్రూప్- ఏలో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంగ్ కాంగ్ గ్రూప్ బీలో భాగం అయ్యాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ ఫోర్స్ దశకు అర్హత సాధిస్తాయి.
మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమౌతాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండేది. దీన్ని అరగంట ముందుకు జరిపింది.

Shreyas Iyer Speaks Out It s Frustrating Being Exclusion of the Asia Cup

ఈ టోర్నమెంట్ ఆడే భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్ ఎంపిక కాలేదు. అతని పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. జట్టును ప్రకటించిన సుమారు రెండు వారాల తర్వాత తన మౌనాన్ని వీడాడు శ్రేయాస్. జాతీయ జట్టు నుంచి తొలగించినప్పుడు ఆటగాళ్లు ఎదుర్కొనే మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో వివరించాడు. తానూ అలాంటి వేదనను ఎదుర్కొన్నానని వ్యాఖ్యానించాడు.

ఐక్యూఓఓ ఇండియా పాడ్‌ కాస్ట్‌లో శ్రేయాస్ అయ్యర్ మాట్లాడాడు. ఇలాంటి సందర్భాల్లో ప్లేయర్లకు తమపై తమకున్న నమ్మకాన్ని తుడిచేసినట్టవుతుందని వ్యాఖ్యానించాడు. ఫామ్ లో ఉండీ, కఠోరంగా శ్రమిస్తోన్నప్పుడు కూడా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం తీవ్ర ఫ్రస్ట్రేషన్ కు గురి చేస్తుందని అన్నాడు. ఆసియా కప్ కు తాను ఎంపిక కాలేదని తెలిశాక ఫ్రస్ట్రేషన్ కు గురయ్యాయని, నిరాశ చెందానని పేర్కొన్నాడు.

నిలకడగా రాణిస్తూ, జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడుతున్నప్పుడు ఎవరైనా సరే అతన్ని ప్రోత్సహించాలని, అండగా ఉండాలని, సంపూర్ణ మద్దతు ఇవ్వాలనీ శ్రేయాస్ అయ్యర్ చెప్పాడు. ఆసియా కప్ వంటి భారీ టోర్నమెంట్లు ఆడే అవకాశాలు లభించినా లభించకపోయినా నిజాయితీతో తన పని తాను చేసుకుంటూ వెళ్తానని వ్యాఖ్యానించాడు.

ఆసియా కప్ కు ఎంపికైన భారత జట్టులో- సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, జస్ ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్, కుల్ దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రానా, రింకు సింగ్ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+