World Cup 2023: 14 పరుగుల దూరంలో గిల్ ప్రపంచ రికార్డు- కివీస్ తో మ్యాచ్ వేళ..!!
ప్రపంచ కప్ సమయంలో కీలక మ్యాచ్ కు సర్వం సిద్దమైంది. వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన ఐదో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టబోతుంది.అటు న్యూజిలాండ్ కూడా వరుసగా నాలుగు విజయాలతో ఊపు మీదుంది. ఇప్పటివరకు టోర్నీలో అపజయం ఎరుగని జట్లు కీలక పోరుకు సిద్దమయ్యాయి. ఇదే సమయంలో ఈ మ్యాచ్ లో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టే అవకాశాలున్నాయి.
మెగా మ్యాచ్ కు సిద్దం: ప్రపంచ కప్ లో తొలి రెండు స్థానాల్లో ఉన్న అగ్రశ్రేణి జట్లు నువ్వా - నేనా అన్నట్లుగా హోరా హోరీ పోరుకు సిద్దమయ్యాయి. ఇప్పటివరకు టోర్నీలో అపజయం ఎరుగని జట్లు ఈ రెండే కావడం గమనార్హం. దీంతో ఈ మ్యాచ్‌పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. కాగా నేడు జరిగే మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు ఓడిపోనుంది.

అలాగే గెలిచిన జట్టే పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోనుంది. ప్రస్తుతం రెండు జట్ల ఖాతాలో ఎనిమిదేసి పాయింట్ల చొప్పున ఉన్నప్పటికీ భారత్ కంటే మెరుగైన రన్ రేటు ఉన్న కారణంగా కివీస్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గిల్ 14 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డును బద్దలుకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గిల్ ప్రపంచ రికార్డు దిశగా: వన్డే ఫార్మాట్లో ఇప్పటివరకు 37 మ్యాచ్‌లు ఆడిన శుభ్‌మన్ గిల్ 64 సగటుతో 1,986 పరుగులు చేశాడు. మరొక 14 పరుగులు చేస్తే 2 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. అయితే ఆ 14 పరుగులను మరొక రెండు ఇన్నింగ్స్‌ల్లోనే సాధిస్తే వన్డే ఫార్మాట్‌లో వేగంగా 2 వేల పరుగులు సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు హషీమ్ ఆమ్లా ప్రపంచ రికార్డును గిల్ బద్దలుకొడతాడు.
ప్రస్తుతం అత్యంగ వేగంగా 2 వేల పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఆమ్లా మొదటి స్థానంలో ఉన్నాడు. 40 ఇన్నింగ్స్‌ల్లోనే 2 వేల పరుగులు చేసిన ఆమ్లా వేగంగా ఈ మార్కు అందుకున్న బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు 37 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన గిల్ మరొక రెండు ఇన్నింగ్స్‌ల్లో 14 పరుగులు చేస్తే ఆమ్లా ప్రపంచ రికార్డును బద్దలుకొడతాడు.

నేటి మ్యాచ్ లో సాధిస్తారా: అయితే ఆ 14 పరుగులను గిల్ ఈ రోజు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లోనే సాధించే అవకాశాలున్నాయి. అదే జరిగితే నేటి మ్యాచ్‌లోనే గిల్ ఈ ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. కాగా తన కెరీర్లో 19 వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే 1,000 పరుగులు పూర్తి చేసిన గిల్.. అత్యంత వేగంగా ఈ మార్కు అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్ ఇప్పటికే ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
ఈ ఏడాది ఇప్పటివరకు 22 వన్డే మ్యాచ్‌లాడిన గిల్ 1,299 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లాడిన గిల్ 69 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో, ఈ రోజు మ్యాచ్ లో గిల్ దూకుడు పైన ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications