గందరగోళంలో రోహిత్ శర్మ కేరీర్
భారత జట్టు వన్డే ఫార్మట్ కేప్టెన్ రోహిత్ శర్మకు ఎర్త్ పడినట్టే కనిపిస్తోంది. అతని స్థానంలో వన్డే ఫార్మట్ కు కూడా కొత్త కేప్టెన్ అపాయింట్ కానున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన అయిదు మ్యాచ్ ల అండర్సన్- టెండుల్కర్ సిరీస్ లో టెస్ట్ కేప్టెన్ శుభ్ మన్ గిల్ సత్తా చాటడమే దీనికి కారణం. అదే సమయంలో రోహిత్ శర్మకు వయసు మీద పడటాన్ని కూడా బీసీసీఐ పరిగణనలోకి తీసుకున్నట్టయింది. వన్డే సిరీస్ లో ఆస్ట్రేలియాతో తలపడబోయే భారత జట్టుకు ఇక గిల్ నాయకత్వాన్ని వహించనున్నాడు.
ప్రస్తుతం టీమిండియాలో మూడు ఫార్మట్లకూ ముగ్గురు కేప్టెన్లు ఉన్న విషయం తెలిసిందే. వన్డేలకు రోహిత్, టెస్టులకు గిల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యాన్ని వహిస్తోన్నారు. వన్డే మినహా మిగిలిన ఫార్మట్లకు వీడ్కోలు పలికాడు రోహిత్. ఈ క్రమంలో వన్డే కేప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించాలనే డిమాండ్ గతంలో వినిపించింది కూడా. దీనికి అనుగుణంగా తాజాగా బీసీసీఐ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గిల్ కు జట్టు పగ్గాలు అందించనుండటం దాదాపుగా ఖాయమైంది.

తన మొట్టమొదటి టెస్ట్ సిరీస్ లోనే అదరగొట్టాడు గిల్. ఇంగ్లాండ్ తో ప్రతిష్ఠాత్మక అండర్సన్- టెండుల్కర్ సిరీస్ ను 2-2తో సమం చేయగలిగాడు. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్లు లేని జట్టుతో గిల్ సిరీస్ ను డ్రా చేస్తాడని చాలా మంది ఊహించలేదు. ఈ విమర్శకులకు దీటైన సమాధానం చెప్పాడు.
అతని నాయకత్వ లక్షణాలకు ప్రశంసలు సైతం లభించాయి. కేప్టెన్ కూల్ అనే పేరు తెచ్చుకున్నాడు. దీంతో వన్డేలకు కూడా కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానాన్ని గిల్ త్వరలో భర్తీ చేస్తాడంటూ మాజీ క్రికెటర్లు అంచనావేశారు. అది వాస్తవరూపాన్ని దాల్చినట్టయింది. యువ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో జట్టులో ఉన్నప్పుడు.. కేప్టెన్ అనేవాడు వాళ్లకు స్ఫూర్తినిచ్చేలా, బ్యాట్‌తో పరుగులు చేయాలి, కెప్టెన్‌గా కూడా బాగా రాణించాల్సి ఉంటుందని అది గిల్ చేసి చూపించాడని మాజీ క్రికెటర్లు ప్రశంసించారు అప్పట్లో.
Giving 2 ICC TROPHY back to back. You politician @bcci doing shameless politics with @ImRo45. Don't forget what happened with hardik after @mi sacked him from captain. Whole country with @ImRo45 forever.
— Raju Ghunia (@raju_ghunia) October 4, 2025
బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అభిమానులు భగ్గుమంటోన్నారు. అకారణంగా రోహిత్ ను తప్పించారంటూ మండిపడుతున్నారు. అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. వన్డే క్రికెట్ రోహిత్‌కు అత్యంత బలమైన ఫార్మాట్ అని, ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో అతను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అని గుర్తు చేశారు. రోహిత్ శర్మ వన్డేల్లో ఏ తప్పు చేయలేదని, ఇది అతని బెస్ట్ ఫార్మాట్ అని స్పష్టం చేస్తోన్నారు. వయస్సు మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఐసీసీ వరల్డ్ కప్ 2027 నుంచి దూరం చేయాలని బీసీసీఐ భావిస్తోన్నట్లు చెబుతున్నారు.
What was Rohit Sharma's mistake ???
— Grow Up (@letbehappy95) October 4, 2025
His mistake was giving 2 ICC trophies in just 9 months to trophyless BCCI. pic.twitter.com/WjPFFBuwZM
రోహిత్ శర్మకు బీసీసీఐ ద్రోహం చేసిందని మరో యూజర్ విమర్శించాడు. రెండు ఐసీసీ ట్రోఫీలను భారత జట్టుకు అందించిన రోహిత్ శర్మను ఉన్నపళంగా కేప్టెన్సీ పగ్గాల నుంచి తొలగించడం ఏ మాత్రం మంచిది కాదని మరో అభిమాని ఆవేదన చెందాడు. వరుసగా 11 సంవత్సరాల పాటు ట్రోఫీలు గెలవని జట్టుకు ఎనిమిది నెలల్లో రెండు ఐసీసీ ట్రోఫీలను రోహిత్ శర్మ అందించాడని గుర్తు చేశాడు. అతని సారథ్యంలో ఐసీసీ ఈవెంట్లల్లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదని చెప్పాడు.
Why would the BCCI want to remove him? He literally just led them to an ICC trophy, man 😥 pic.twitter.com/AO5YcilIuh
— Vishal Nama (@VishalNama18) October 4, 2025
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications