Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rafael Nadal:టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన స్పెయిన్ బుల్..నిరాశలో ఫ్యాన్స్..!!

Rafael Nadal Retirement:టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ తన సుదీర్ఘ టెన్నిస్ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల వయసున్న రాఫెల్ నాదల్ ఇప్పటి వరకు 22 గ్రాండ్ స్లామ్‌ టైటిల్స్‌ను గెల్చుకున్నాడు. వచ్చే నెల నవంబర్‌లో మాలాగాలో జరిగే డేవిస్ కప్‌ తన చివరి గేమ్ అవుతుందని తెలిపాడు. నాదల్ రిటైర్మెంట్ ప్రకటనతో ఆయన అభిమానులు ఒక్కింత నిరాశ చెందారు.
ఇటీవలి కాలంలో నాదల్‌‌కు ఫిట్‌నెస్ పెనుసవాలుగా మారింది. తాను రిటైర్ అవుతున్నట్లు ఒక వీడియో సందేశం ద్వారా క్రీడాలోకానికి తెలిపాడు. ఈ సందర్భంగా నాదల్ భావోద్వేగానికి గురయ్యాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లు నాదల్ వెల్లడించాడు. తాను రిటైర్ కావాలన్న నిర్ణయం వెల్లడించేందుకు చాలా సమయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇది చాలా కష్టమైన నిర్ణయం అయినప్పటికీ ఇక టెన్నిస్‌కు గుడ్‌బై పలకాలని తాను డిసైడ్ అయినట్లు చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు.
నాదల్‌ టెన్నిస్‌ క్రీడలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో క్రమశిక్షణతో కలిగి ఉన్నాడు. ఆ అంకితభావమే ఆయన్ను టెన్నిస్ ప్రపంచంలో రారాజుగా నిలిపింది. జీవితం అన్నాక ప్రతీ విషయంలో ప్రారంభం ముగింపు ఉంటుందని అలానే తాను టెన్నిస్‌ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో విజయాలను అందుకోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఓటములు కూడా పలకరించాయని నాదల్ నెమరేసుకున్నాడు. ఇక సుదీర్ఘంగా సాగిన తన కెరీర్‌కు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే చివరిగా తాను బరిలో దిగబోయే డేవిస్ కప్ అత్యంత ప్రతిష్టాత్మకమైందిగా నాదల్ అభివర్ణించాడు. ప్రపంచ వేదికపై స్పెయిన్‌కు ప్రాతినిథ్యం వహించినందుకు చాలా గర్వంగా ఉందని నాదల్ తెలిపాడు.
టెన్నిస్‌లో నాదల్ ఒక సంచలనం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ కమ్యూనిటీ మరియు అభిమానులు నాదల్ రిటైర్మెంట్ వార్తను జీర్ణించుకోలేకున్నారు. కొందరు విచారం వ్యక్తం చేయనుండగా మరికొందరు ఆయన సక్సెస్‌ను కొనియాడుతున్నారు. నాదల్ టెన్నిస్ ప్రయాణం సాఫీగా సాగలేదు. అతను రాకెట్ పట్టినప్పటి నుంచి ప్రపంచ టెన్నిస్ ఐకాన్‌గా ఎదిగే వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదురీది కింగ్ ఆఫ్ టెన్నిస్‌గా పేరు ప్రఖ్యాతలు గడించాడు. ఇదే సమయంలో కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తన కెరీర్ ఆసాంతం అండగా ఉన్న తన కుటుంబ సభ్యులకు అభిమానులకు నాదల్ కృతజ్ఞతలు తెలిపాడు.
నాదల్‌ను గాయాలు వెంటాడినప్పటికీ తిరిగి పుంజుకుని రాకెట్ చేతితో పట్టుకుని ఎన్నో విజయాలను సాధించాడు. ఇక డేవిస్ కప్‌లో చివరిసారిగా స్పెయిన్‌కు ప్రాతినిథ్యం వహించాలనే అతని నిబద్ధతను చాలా మంది ప్రశంసిస్తున్నారు. నాదల్ కెరీర్‌లో తాను ఆడిన మ్యాచ్‌లను వీక్షించిన అభిమానులు ఉర్రూతలతో ఊగిపోయారు. నాదల్ కోర్టులో అడుగుపెడితే చాలు అభిమానుల్లో మామూలు పూనకం వచ్చేది కాదు. అందుకే ప్రపంచ టెన్నిస్‌ అభిమానులకు నాదల్ ఒక మంచి వ్యసనంగా మారాడు.
అసాధారణమైన కెరీర్‌కు తెర పడిపోవడంతో, అత్యుత్తమ ప్రతిభ, పట్టుదల, క్రీడాస్ఫూర్తి వంటివాటికి ఉదాహరణగా నిలిచిన ఆటగాడిని టెన్నిస్ ప్రపంచం కొనియాడింది. నాదల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలకడం అనేది ఒక భావోద్వేగమైన క్షణం.టెన్నిస్ ప్రపంచంలో ఒక సువర్ణాధ్యాయం ముగిసిందనే చెప్పాలి.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+