ఆర్ఆర్ నరాలు తెంచారు

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌ 57 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే చెరో నాలుగు వికెట్లు పడగొట్టిన పేసర్లు సకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగేల మ్యాజికల్ స్పెల్.. ఈ జట్టును పాయింట్ల పట్టికలో టాప్-4లోకి చేర్చింది. ఈ విజయంతో హెన్రిచ్ క్లాసెన్ ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్ ఆడాడు క్లాసెన్.

ప్రారంభంలోనే సగం వికెట్లు..

సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 216 పరుగులను అందుకునే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ తడబడింది. ప్రారంభంలోనే సగం వికెట్లను కోల్పోయింది. అరంగేట్ర బౌలర్ ప్రఫుల్ హింగే తన ఐపీఎల్ కేరీర్ మొదటి ఓవర్‌ లోనే మూడు వికెట్లు పడగొట్టి రాజస్థాన్ రాయల్స్ నరాలు తెంచాడు. వైభవ్ సూర్యవంశీ, జురెల్, ప్రిటోరియస్‌లను పెవిలియన్ చేర్చాడు. అనంతరం సాకిబ్ హుస్సేన్ దెబ్బకు యశస్వి జైస్వాల్‌ అవుట్ కావడంతో ఆర్ఆర్ 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

SRH bowlers Praful Hinge and Sakib Hussain delivering an IPL debut masterclass Best bowling figures

డబుల్ డిజిట్ ముగ్గురిదే

డోనోవన్ ఫెరీరా (69), రవీంద్ర జడేజా (45) 118 పరుగుల భాగస్వామ్యంతో ప్రతిఘటించారు గానీ విజయాన్ని అందించలేకపోయారు. సకిబ్ హుస్సేన్ లోయర్ ఆర్డర్‌ను పడగొట్టాడు. లోయర్ ఆర్డర్ లో తుషార్ దేశ్ పాండే ఒక్కడే 25 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్ మొత్తం మీద ఫెరీరా, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్ పాండే మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగలిగారు. యశస్వి జైస్వాల్- 1, వైభవ్ సూర్యవంశీ- 0, జురెల్- 0, ప్రిటోరియస్- 0, రియాన్ పరాగ్- 4, జోఫ్రా అర్చర్- 2, రవి బిష్ణోయ్- 0, నాండ్రే బర్గర్- 3 (నాటౌట్) పరుగులు చేశారు.

విన్నింగ్ స్ట్రీక్ కు బ్రేక్..

హింగే (4/34), హుస్సేన్ (4/24) చెరో నాలుగు వికెట్లతో సన్ రైజర్స్ కు ఘన విజయాన్ని సాధించిపెట్టారు. రాజస్థాన్ రాయల్స్ నాలుగు మ్యాచ్‌ల విజయ పరంపరకు తెరదించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో మూడు ఓటములతో పాటు తమ రెండవ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటమి ఎదురైనప్పటికీ రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానానికి ఎగబాకింది.

ఆ బౌలర్ల సరసన..

ఐపీఎల్ అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ల సరసన చేరారు ప్రఫుల్ హింగె, సాకిబ్ హుస్సేన్. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు డెబ్యుటెంట్ బౌలర్లు నమోదు చేసిన రికార్డులు ఇలా ఉన్నాయి.

6/12 - అల్జారీ జోసెఫ్ (ముంబై ఇండియన్స్) vs సన్ రైజర్స్ హైదరాబాద్, 2019

5/17 - ఆండ్రూ టై (గుజరాత్ టయన్స్) vs రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్, 2017

4/11 - షోయబ్ అక్తర్ (కోల్ కత నైట్ రైడర్స్) vs ఢిల్లీ డేర్ డెవిల్స్, 2008

4/26 - కెవోన్ కూపర్ (రాజస్థాన్ రాయల్స్) vs కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, 2012

4/24 - అశ్వనీ కుమార్ (ముంబై ఇండియన్స్) vs కేకేఆర్, 2025

4/24 - సాకీబ్ హుస్సేన్ (సన్ రైజర్స్ హైదరాబాద్) vs రాజస్థాన్ రాయల్స్, 2026

4/33 - డేవిడ్ వీస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) vs ముంబై ఇండియన్స్, 2015

4/34 - ప్రఫుల్ హింగే (సన్ రైజర్స్ హైదరాబాద్) vs రాజస్థాన్ రాయల్స్, 2026

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+