SRH.. ఏదో తేడాగా ఉందేంటీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ నేడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభం కాబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను ఢీకొట్టనుంది. రజత్ పటిదార్ సారథ్యంలో తొలి టైటిల్ గెలవడంతో ఆర్సీబీ ఆత్మవిశ్వాసంతో ఉంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్ వంటి బలమైన బ్యాటింగ్ లైనప్‌తో వారికి శుభారంభం పట్ల నమ్మకం ఉంది.
ఇషాన్ కిషన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ భిన్నమైన సవాల్‌ను ఎదుర్కొంటోంది. బ్యాటింగ్ దూకుడుగా ఉన్నా, పాట్ కమిన్స్ లేకపోవడం బౌలింగ్‌ను బలహీనపడింది. జోష్ హేజిల్‌వుడ్ వంటి కీలక బౌలర్లు లేని ఆర్సీబీని ఎదుర్కోవడానికి ఇషాన్ కిషన్ ఎలాంటి వ్యూహాలు పన్నుతాడనే విషయంపైనే గెలుపు ఆధారపడివుంది.

- రజత్ పటిదార్ గత ఐపీఎల్ లో ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. తొలి సీజన్‌లోనే ఆర్సీబీని విజేతగా నిలిపాడు. 16 మ్యాచ్‌లలో 11 విజయాలు, 5 ఓటములు అతని ఖాతాలో ఉన్నాయి. గెలుపు శాతం 68.75.
- కెప్టెన్ గా ఇషాన్ కిషన్ కు లో ఇదే తొలి సీజన్. అతనికి నాయకత్వం కొత్తేమీ కాదు. గత ఏడాది తాను సారథ్యాన్ని వహించిన జార్ఖండ్‌కు తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించిన అనుభవం అతనికి ఉంది.
గాయం నుంచి కోలుకుంటూ, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్ లేకపోవడం వల్ల పేస్ యూనిట్‌లో లోటు స్పష్టం. దీంతో భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ అదనపు బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. ఆర్సీబీకి అతిపెద్ద బలం మెరుపు బ్యాటింగ్. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, జాకబ్ బెథెల్ వంటి బ్యాటర్లతో కూడిన లైనప్‌తో ప్రత్యర్థులను చిత్తు చేసే సత్తా ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టులో.. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫ్ఫీ, రసిఖ్ దార్ ఆడే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ లో కూడా గాయాల బెడద లేకపోలేదు. బౌలింగ్ విభాగంలో బలహీనంగానే కనిపిస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ప్రారంభ మ్యాచ్ లకు మైనస్ పాయింట్. ఇది బౌలింగ్ సమతుల్యతను దెబ్బతీస్తోంది. బ్యాటింగ్-ఫ్రెండ్లీ చిన్నస్వామి పిచ్‌పై జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్సె ఎలా రాణిస్తారనేది ఆ జట్టు ముందున్న హర్డిల్.
బ్యాటింగ్‌లో ఆర్సీబీకి దీటుగా నిలిచే సత్తా ఉంది సన్ రైజర్స్ కు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి బలమైన బ్యాటింగ్ కోర్.. ఈ మ్యాచ్‌ను అధిక స్కోరు పోరుగా మార్చగలదు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టులో.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్/వి.కీ.), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ ఆడొచ్చు. బౌలింగ్ డెప్త్ తక్కువగా ఉన్న ఇరు జట్లలో బెంగళూరు పరిస్థితులను ఏ బ్యాటింగ్ లైనప్ మెరుగ్గా సద్వినియోగం చేసుకుంటుంది అనే దానిపైనే ఈ తొలి మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది.
-
IPL 2026: బుడ్డోడి వీక్ నెస్ బయటపెట్టేసిన ప్రఫుల్..! ఇతర బౌలర్లకూ అస్త్రం? -
ఏమి రా బాలరాజు.. !! -
IPL 2026: కేకేఆర్‌ను ముంచిన వరుణ్ చక్రవర్తీ.. CSK గ్రాండ్ విక్టరీ! -
ధురందర్ 2 కంటే లాంగ్ మ్యాచ్! ఐపీఎల్లో సరికొత్త రికార్డు -
Ishan Kishan: రాజస్థాన్ మ్యాచ్ తెచ్చిన మార్పు-ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం..! -
ఆర్ఆర్ నరాలు తెంచారు -
Jasprit Bumrah:బుమ్రాకు ఏమైంది..ఆందోళనలో ఫ్యాన్స్..!! -
హార్దిక్ అవుట్ తో కృనాల్ వైల్డ్ సెలబ్రేషన్స్- ఆ వివాదమే అసలు కారణమా..!? -
సరైనోళ్లు తగిలితే బుడ్డోడి డొల్లతనం బయటపడుతుంది.!! -
బుడ్డోడి వికెట్ కోసం పెద్ద ప్లానే చేశా-ముందే చెప్పి మరీ..! ప్రఫుల్ హింగే షాకింగ్..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..!












Click it and Unblock the Notifications