అరుదైన వ్యాధితో పోరాడుతున్న స్టార్ క్రికెటర్.. సాయం కోసం ఎదురుచూపు..
ఐర్లాండ్ స్టార్ క్రికెటర్ సిమీ సింగ్ ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆయన గతకొన్నిరోజులగా లివర్ సంబంధిత వ్యాధితో పోరాడుతున్నారు. ప్రస్తుతం సిమీ సింగ్ గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సను పొందుతున్నట్లు సమాచారం. ట్రీట్‌మెంట్‌కు దాతల నుంచి సహాయం కోసం ఈ స్టార్ క్రికెటర్ ఎదురుచూస్తోన్నట్లు తెలుస్తోంది. సిమీ సింగ్ ఐర్లాండ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చారు.
సిమీ సింగ్ పంజాబ్‌లోని మొహాలీలో జన్మించాడు. ఇండియా తరఫున అండర్ 14, అండర్ 17 వంటివి ఆడాడు. అనంతరం ఐర్లాండ్‌కు వలస వెళ్లిన సిమీ సింగ్ ఆ దేశం తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆడాడు. 2017లో ఐర్లాండ్ తరఫున తన క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించారు సిమీ సింగ్. అతను ఇప్పటివరకు 35 వన్డేలు, 53 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 593 రన్స్, 39 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికాపై ఆడిన వన్డేల్లో డెబ్యూ సెంచరీని సాధించాడు. వన్డేల్లో యూఏఈపై పది పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు సిమీ సింగ్. ఇక, ఇదే మ్యాచ్‌లో ఆయన హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. ఓ వన్లేల్లో ఐదు వికెట్లు, యాభై రన్స్ సాధించిన అతి తక్కువ మంది క్రికెటర్లలో ఒకరిగా సిమీ సింగ్ రికార్డ్ సృష్టించాడు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రతిభతో ఐర్లాండ్‌కు చక్కటి విజయాల్ని అందించాడు సిమీసింగ్. రెండు సంవ్సతరాల క్రితం న్యూజిలాండ్‌తో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత పలు అనారోగ్య సమస్యల వల్ల ఐర్లాండ్ జట్టుకు దూరంగా ఉంటున్నాడు.

కాలేయ దానం చేయనున్న భార్య..
సిమీ సింగ్ గత కొన్ని రోజులుగా లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. త్వరలోనే సిమీసింగ్‌కు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్‌ను నిర్వహించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిమీ సింగ్‌కు అతడి భార్య ఆగమ్‌దీప్ కౌర్ కాలేయ దానం చేయనున్నట్లు సమాచారం. సంవత్సరం నుంచి అతడు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్నట్లు తెలిసింది. మెరుగైన వైద్యం కోసం ఐర్లాండ్ నుంచి ఇండియాకు వచ్చినట్లు అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు. సిమీ సింగ్ త్వరగా కోలుకోవాలంటూ ఐర్లాండ్ క్రికెట్ అసోసియేషన్ తన సోషల్‌మీడియా ఖాతాలో ట్వీట్ చేసింది.












Click it and Unblock the Notifications