టెస్టుల్లో కూడా ఇంత జిడ్డుగా ఆడరు కదరా ఆజామూ- నువ్వు యాడ దొరికావురా మాకు
బిగ్ బాష్ లీగ్ (BBL) మ్యాచ్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. సిడ్నీ థండర్‌పై మ్యాచ్ లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతున్న పాకిస్తాన్ డాషింగ్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అవకాశం ఉన్నా కూడా స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న స్టీవ్ స్మిత్ సింగిల్ తీసి బాబర్ ఆజమ్ కు బ్యాటింగ్ ఇవ్వడానికి నిరాకరించాడు. స్ట్రైకింగ్ ను తనవద్దే ఉంచుకున్నాడు. టీ20 ఫార్మట్ కు అనుగుణంగా బాబర్ దూకుడుగా ఆడకపోవడం, డిఫెన్స్ పై డిపెండ్ కావడం, జిడ్డు బ్యాటింగ్ చేస్తోండటమే దీనికి కారణం.
బీబీఎల్ లో భాగంగా సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన సిడ్నీ థండర్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ తడాఖా చూపాడీ మ్యాచ్ లో. 65 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, 11 ఫోర్లతో 110 పరుగులు చేశాడు. అజేయంగా నిలిచాడు. అనంతరం సిడ్నీ సిక్సర్స్ అలవోకగా దీన్ని అందుకుంది. 17.2 ఓవర్లలోనే అయిదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. విజయం సాధించింది. అయిదు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది.

సిడ్నీ సిక్సర్స్ ఇన్నింగ్ లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ హైలైట్. బాబర్ ఆజమ్ తో కలిసి ఇన్నింగ్ ఆరంభించిన స్మిత్.. సెంచరీతో కదం తొక్కాడీ బ్యాటర్. 61 బంతుల్లో తొమ్మిది భారీ సిక్సర్లు బాదాడు. అయిదు బుల్లెట్ల వంటి ఫోర్లు కొట్టాడు. సరిగ్గా 100 పరుగులు చేశాక సంఘా బౌలింగ్ లో వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బాబర్ కూడా ధీటుగా రాణించాడు. 39 బంతుల్లో ఏడు ఫోర్లతో 47 పరుగులు కొట్టాడు.
"They've said no run to that."
— KFC Big Bash League (@BBL) January 16, 2026
Steve Smith knocked a run back off the bat of Babar Azam, so he could have the strike for the Power Surge! #BBL15 pic.twitter.com/BaZET2UF2t
ఒక్క సిక్స్ కూడా అతను కొట్టలేకపోయాడు. అదే- స్మిత్ అసహనానికి కారణమైంది. 12వ ఓవర్ చివరి బంతిని మిడాఫ్ దిశగా ఆడాడు స్మిత్. సింగిల్ తీసే అవకాశం అతనికి దొరికింది. అయినప్పటికీ రన్ తీయలేదు. అప్పటికి సిడ్నీ సిక్సర్స్ గెలవడానికి 48 బంతుల్లో 49 పరుగులు అవసరం. అప్పటికి 88 పరుగుల మీద ఉన్నాడు స్మిత్. తాను రన్ తీస్తే స్ట్రైకింగ్ అవకాశం బాబర్ ఆజమ్ కు వెళ్తుంది. అతను జిడ్డుగా ఆడలేకపోతున్నాడనే కారణంతో స్ట్రైకింగ్ ఇవ్వలేదు.
ఆ తరువాతి బంతికే మెక్ ఆండ్రూ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఆజమ్. పెవిలియన్ కు తిరిగి వెళ్లే సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. బ్యాట్ గాల్లోకి ఝుళిపిస్తూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. బ్యాట్‌ను ఫీల్డింగ్ కుషన్లపై విసిరేశాడు. దీనికి గల కారణాన్ని స్టీవ్ స్మిత్ వివరించాడు. సింగిల్ తీయకపోవడం పట్ల బాబర్ సంతోషంగా లేడని అన్నాడు. పవర్‌సర్జ్‌ను పూర్తిగా వినియోగించుకునే ఉద్దేశంతోనే తాను అలా చేశానని, ఇది వైరల్‌గా మారిందని స్మిత్ వివరించారు.
-
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications